E-Paper
Advertisement

Odisha Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Odisha Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Advertisement

Road Accident in Odisha(Today news paper telugu): ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బజ్ పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో నేషనల్ హైవే నంబర్ 16పై వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి పై నుంచి క్రింద పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా.. మరో 38 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను కటక్ లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : జీలం నదిలో ప్రమాదం, బోటులో స్కూల్ స్టూడెంట్స్

Advertisement

ప్రయాణికులతో బస్సు పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ ఘనటపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×