E-Paper
Advertisement

CJP ఆందోళనలు.. 17 మెట్రో స్టేషన్లు బంద్, స్తంభించిన ప్రయాణాలు!

CJP ఆందోళనలు.. 17 మెట్రో స్టేషన్లు బంద్, స్తంభించిన ప్రయాణాలు!
Advertisement

Delhi Metro: ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. CJP చేపట్టిన నిరసన ప్రదర్శనలు రాజధానిని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. రోజురోజుకూ ఈ ఆందోళనలకు మద్దతుదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం, స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

అయితే, సమస్య మరింత తీవ్రరూపం దాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (DMRC) భద్రతా కారణాల దృష్ట్యా వరుసగా మూడో రోజు కూడా 17 ప్రధాన మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. ఈ నిర్ణయంతో నిత్యం లక్షలాది మంది ప్రయాణించే మెట్రో సేవలకు విఘాతం ఏర్పడటంతో, సాధారణ పౌరులు మరియు ఉద్యోగులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

ఆందోళనలు తీవ్రంగా ఉన్న జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, అలాగే పార్లమెంట్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిరసనకారులు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఆయా మార్గాల్లో భారీ కేడ్లను ఏర్పాటు చేసి రోడ్లను పూర్తిగా దిగ్బంధించారు. పరిస్థితులు చేయిదాటిపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద CJP నాయకులు, మద్దతుదారుల నిరసన హోరెత్తుతోంది. శాంతియుతంగా మొదలైన ఈ ఆందోళన రానురాను ఉధృతంగా మారడంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. భద్రతను దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: స్కూలుకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్.. స్కూల్‌లో ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×