E-Paper
Advertisement

Chhattisgarh Encounter: చత్తీస్ గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: చత్తీస్ గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
Advertisement

Chhattisgarh Encounter: ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.

సుక్మాజిల్లాలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంధి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు మూడు గంటలపాటు భీరక యుద్ధం జరిగింది. ఊహించని రీతిలో పీఎల్ జీఏ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా భద్రతా బలగాల్లు అంచెలంచెలుగా మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పుల జరిపాయి. ఒక ప్లేస్‌లో నలుగురు, మరో ప్లేస్‌లో నలుగురు మొత్తం.. పది మంది నక్సల్స్ మృతి దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ బస్తర్, పి సుందర్‌రాజ్ తెలిపారు.

Advertisement

AK-47, ఇతర ఆయుధాలతో పాటు ఒక INSAS, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పారిపోయిన మావోస్టులు పలువురు గాయాలతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం 257 మంది మావోస్టులు మరణించగా, 861 మందిని అరెస్టు చేశారు. 789 మంది లొంగిపోయారు. మొత్తం మృతుల సంఖ్య చూస్తే.. 2010లో అత్యధికంగా 1,005 నుండి 90 శాతం తగ్గి 2024 సెప్టెంబర్ నాటికి 96కి చేరుకుంది.

Also Read: అదానీ అవినీతిలో ప్రధాని మోడీ భాగస్వామ్యం.. రాహుల్ ఆరోపణలు.. మండిపడిన బిజేపీ

Advertisement

2026 నాటికి ఛత్తీస్‌గఢ్ పూర్తిగా మావోస్టుల నుండి విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భద్రతా బలగాలు ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×