E-Paper
Advertisement

Teja Sajja: పెళ్లి పై బిగ్ అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ… త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారా?

Teja Sajja: పెళ్లి పై బిగ్ అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ… త్వరలోనే  పెళ్లిపీటలు ఎక్కనున్నారా?
Advertisement

Teja Sajja: టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఎంతో బిజీగా ఉన్న తేజ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ సజ్జ తాజాగా వారాహి సిల్వర్ జువెలరీ(Varahi Silver Jewellery) లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

పెళ్లి పై తేజ సజ్జ రియాక్షన్..

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిపోర్టర్స్ నుంచి తేజ సజ్జకు తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలోనే మీ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.. అందుకే జువెలరీ డిజైనింగ్ కూడా చేయించుకున్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు తేజ సజ్జ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఈ సిల్వర్ జువెలరీని వేసుకుంటారా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదా..

Advertisement

సందర్భంగా తేజ మాట్లాడుతూ ఇది పెళ్లికి సంబంధించిన వేడుక కాదని తెలిపారు. ఇక తను కనుక పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా తాను సిల్వర్ జువెలరీని వాడుతానని అలాగే వీటి గురించి పోస్టులు కూడా చేస్తానని తెలిపారు. మనం ఎంత ఆడంబరాలకు వెళ్ళామనేది ముఖ్యం కాదు మన పాకెట్ సేఫ్టీ గురించి మన సేఫ్టీ అలాగే కంఫర్ట్ గురించి ఆలోచించాలని, సిల్వర్ కూడా తక్కువ విషయం కాదని తెలిపారు. ఇక మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయికి ఫస్ట్ గిఫ్ట్ ఏమిచ్చారు అంటూ కూడా మరో ప్రశ్న ఎదురైంది.ఇలా తేజ లవ్ రూమర్స్ గురించి వస్తున్న వార్తలను బయటపెడుతూ ఈయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసిన తేజ మాత్రం ఎలాంటి లవ్ లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జ..

Advertisement

ప్రస్తుతం ఈయన తన పెళ్లిపై కాకుండా కెరియర్ పై దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తేజ ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం అవుతోంది. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే మిరాయ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరో సక్సెస్ అందుకున్న తేజ ప్రస్తుతం జై హనుమాన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఇటీవల ఈయన ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ‘ది ట్రైటర్స్’ (The Traitors) రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కు వ్యాఖ్యాతగా తేజ వ్యవహరించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

Also Read: Ramcharan: ఫ్యాన్స్ గెట్ రెడీ… చరణ్ బర్త్ డే..బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×