E-Paper
Advertisement

Vishwambhara: ‘విశ్వంభర’ విషయంలో అసలేం జరుగుతుంది? న్యూ డౌట్స్ స్టార్ట్స్!

Vishwambhara: ‘విశ్వంభర’ విషయంలో అసలేం జరుగుతుంది? న్యూ డౌట్స్ స్టార్ట్స్!
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంపై రోజురోజుకూ వార్తలు, అదే సమయంలో అనుమానాలు వైరల్ అవుతున్నాయి. కారణం ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? లేదంటే చిరంజీవి కెరీర్‌లో చిత్రీకరణ జరుపుకుని ఆగిపోయిన సినిమాల జాబితాలోకి వెళుతుందా? అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఎటువంటి అప్డేట్ రావడం లేదు. దర్శకుడు మీడియా ముందు కనిపించినప్పుడు.. ‘వస్తుంది త్వరలోనే’ అని చెప్పడం తప్పిదే.. ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు. మెగాస్టార్ కూడా ఆ మధ్య మీడియా వాళ్లు అడిగితే.. జూన్‌లో ఉంటుందని అన్నారు. కానీ, మళ్లీ ఎటువంటి హడావుడి లేదు. జూన్ అంటే ప్రస్తుతం ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. అసలు ఎటువంటి కదలికా లేదు.

Also Read- Chota K Naidu: ‘అంజి’ సినిమాకి తలెత్తుకుని పని చేస్తే.. ‘విశ్వంభర’కి తలదించుకుని పని చేస్తున్నా!

కొత్తగా అనుమానాలు మొదలు..

Advertisement

సినిమాకు బిజినెస్ జరగలేదు అనుకోవడానికి, అసలు ఇందులో ఉన్న కంటెంట్ ఏంటో తెలిసేలా చేయాలి కదా. అందులోనూ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా చిరంజీవి సినిమా విషయంలో ఇలా కదలిక లేకపోవడం విడ్డూరం అనే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా మరో అనుమానం మొదలైంది. ఈ సినిమాకు కెమెరామ్యాన్‌గా పని చేస్తున్న టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు చేసిన వ్యాఖ్యలతో.. అనుకున్నంత పాజిటివ్‌గా అయితే ‘విశ్వంభర’ మూమెంట్ లేదని తెలుస్తోంది. మొన్నటి వరకు సినిమా ఆలస్యానికి ఒక కారణంగా ఛోటా కె నాయుడు (Chota K Naidu) పేరు వినిపించింది. ఇప్పుడు ఆయనే తనదేం లేదని, వాళ్లు ఏం చెబితే అది చేస్తున్నామని, అస్సలు మైండ్ వాడటం లేదంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

Also Read- Lawho Gouranger Naam Rey OTT : ఓటీటీలోకి బెంగాలీ పీరియాడికల్ డ్రామా… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

సీజీ వర్సెస్ కెమెరా

Advertisement

ఆయన మాటలను బట్టి చూస్తే.. సీజీ వాళ్లకి, కెమెరా డిపార్ట్‌మెంట్‌కు మధ్య ఇష్యూస్ నడిచినట్లుగా అయితే క్లియర్‌గా తెలుస్తుంది. అందుకే కెమెరామ్యాన్ సైడ్ నుంచి నాసిరకం అవుట్‌ఫుట్ వచ్చి ఉంటుందని, ఇది సీజీలో కరెక్ట్ చేసుకోలేక.. నేపమంతా కెమెరామ్యాన్‌పై వేస్తున్నారనేలా ఛోటా మాటలు ఉన్నాయి. ఆయన ఏదైనా సలహా ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదని, ఛోటా కె నాయుడు తన వెర్షన్‌ని వినిపించాడు. అంటే, వీళ్ల ఈగో కోసం 400 కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాత ఏమైపోయినా పర్లేదన్నమాట. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా, ఒక యంగ్ డైరెక్టర్ కెరీర్.. ఇవన్నీ వదిలేసి, సీజీ అండ్ కెమెరా డిపార్ట్‌మెంట్ వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారనేది ఇక్కడ అర్థమవుతోంది. మరి ఈ ఈగో క్లాష్‌లన్నీ దాటుకుని, ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుందో.. అసలు అవుతుందో అవదో? ఏమో డౌటే..

Also Read- Arjun Kalyan: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి అదే కారణమా.. అసలు మ్యాటర్ చెప్పిన అర్జున్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×