E-Paper
Advertisement

Aaya Sher Song: ‘ఆయా షేర్’.. పాట వెనుక ఎలాంటి కసరత్తు జరిగిందో తెలుసా!

Aaya Sher Song: ‘ఆయా షేర్’.. పాట వెనుక ఎలాంటి కసరత్తు జరిగిందో తెలుసా!
Advertisement

Aaya Sher Song: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ మూవీకి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆయా షేర్’ ప్రపంచవ్యాప్తంగా టా‌ప్‌లో ట్రెండ్ అవుతూ భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ‘ఆయా షేర్’ సాంగ్‌కి వస్తున్న స్పందనతో లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ (Kasarla Shyam).. ఈ పాట వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలిపారు.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ విషయంలో అసలేం జరుగుతుంది? న్యూ డౌట్స్ స్టార్ట్స్!

నాని స్పందనిదే..

Advertisement

ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమా ‘చంటిగాడు’. ‘నీలపూరి గాజులు’ అనే పాటతో నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు రాశాను. అయితే ‘లై’ సినిమాతో మళ్లీ నాకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత ఇస్మార్ట్ శంకర్, రాములో రాములా, డిజె టిల్లు.. ఇలా వరుసగా విజయవంతమైన పాటలు వచ్చాయి. ఇక నానికి రాసిన పాటలపై ఆయన ఏమన్నారంటే.. నాకు లైఫ్ లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చాయి. ‘ధూమ్ ధామ్ దోస్తానా, చమ్కీలా అంగి, ఇప్పుడు ఆయా షేర్’.. ఇలా నాకు మర్చిపోలేని హిట్లు ఇచ్చారంటూ చాలా అభినందించారు. ఓదెల శ్రీకాంత్‌తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఏదైనా ఒక సందర్భం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక ఎమోషన్‌తో చెప్తారు. ఈ పాట జరుగుతున్నప్పుడు నేను సెట్లోకి వెళ్లాను. అక్కడ నాకు ఒక ‘సమ్మక్క సారక్క’ జాతర జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ సినిమా కంటే కూడా ఈ సినిమాకు ఎక్కువ కష్టపడుతున్నారు. ఆయనకి సినిమా తప్ప మరొకటి తెలియదు. ఇందులో కొన్ని సన్నివేశాలు చెప్తుంటే షాకింగ్‌గా అనిపించింది. అతనిలో ఇంత ఫైర్ దాగుందా? అని ఆశ్చర్యపోయా.

Also Read- Zootopia 2 OTT : శ్రద్ధా కపూర్ సూపర్ హిట్ యానిమేటెడ్ సీక్వెల్‌ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

సినిమాపై డబుల్ ఇంపాక్ట్

Advertisement

‘ఆయా షేర్’ పాట రాయడానికి శ్రీకాంత్ సిచ్యుయేషన్‌ని చాలా క్లియర్‌గా చెప్పారు. నేను నాని జడల్ క్యారెక్టర్‌ని దృష్టిలో పెట్టుకున్నాను. హీరో ఎప్పుడూ కూడా పుస్తకాల్లో నుంచి పుట్టడు. కష్టం వస్తే జనం మధ్యలో నుంచి పుట్టుకొస్తాడు. అలాంటి జనం మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన ఒక వీరుని కథే ఇది. అలాంటి పాత్రకి ఒక ఎమోషన్ ఉంది. అందుకే పచ్చబొట్టు గాయం.. గుంజుకున్న న్యాయం.. ఇలాంటి పద ప్రయోగాలు చేశాను. ఈ సాంగ్ వచ్చిన తర్వాత సినిమాపై ఇంపాక్ట్ డబులైంది. కమర్షియల్‌గా, మార్కెట్ పరంగా స్కేల్ మారిపోయింది.. ఇదంతా కూడా డైరెక్టర్ శ్రీకాంత్ విజన్. ఇందులో ఎమోషన్స్, యాక్షన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పల్లవి ఉంటే బాగుంటుందనుకున్నాను. ఆ ఆలోచన శ్రీకాంత్ నచ్చింది. ఈరోజు సోషల్ మీడియాలో అదే పల్లవి గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Anjana Devi: చిరంజీవి మదర్‌కు విశ్వ మహిళ అవార్డ్.. ఇంకా ఎవరెవరికంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×