E-Paper
Advertisement

Jananayagan : జననాయగన్ ఫైనల్ డ్యూరేషన్ ఇదే, చివరి సినిమా అనే అంతసేపు కూర్చో పెడుతున్నారా?

Jananayagan : జననాయగన్ ఫైనల్ డ్యూరేషన్ ఇదే, చివరి సినిమా అనే అంతసేపు కూర్చో పెడుతున్నారా?
Advertisement

Jananayagan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్ కి కూడా దాదాపు అదే స్థాయి క్రేజీ ఉంది. ఇంకా ఓపెన్ గా మాట్లాడితే విజయ్ సభలకు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువమంది జనాలు హాజరవుతున్నారు. అయితే దాదాపు పవన్ కళ్యాణ్ మరియు విజయ్ జర్నీ ఒకేలా అనిపిస్తూ ఉంటాయి.

మామూలుగా విజయ్ చేసిన కొన్ని సినిమాలను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ను విజయ్ రీమేక్ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే విజయ్ కూడా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో పొలిటికల్ గా బాగా బిజీ అయిపోయారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పొలిటికల్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు విజయ్.

జననాయగన్ ఫైనల్ డ్యూరేషన్

Advertisement

హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ జననాయగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన సాంగ్ కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. మరోవైపు విజయ్ నటిస్తున్న లాస్ట్ సినిమా కాబట్టి విజయ్ అభిమానులంతా కూడా ఎంతో క్యూరియాసిటీతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా డ్యూరేషన్ మూడు గంటలు మూడు నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో ఒక సినిమాకి మూడు గంటలు డ్యూరేషన్ అంటే అది చాలా పెద్ద రిస్కీ పాయింట్. సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటే కానీ ఆడియన్స్ కి అంత సేపు కూర్చునే ఓపిక ఈరోజుల్లో లేదు.

ఆడియన్స్ హోల్డ్ అవ్వాలి 

Advertisement

ఈరోజుల్లో సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ ని హోల్డ్ చేయటం అనేది మోస్ట్ సక్సెస్ పాయింట్. ఎందుకంటే ఓపిక అనేది చాలామందికి తగ్గిపోయింది. సినిమా ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోయినా కూడా ఆడియన్ ఫోన్లో మునిగిపోతారు. అందుకే చాలామంది ప్రముఖ దర్శకులు వాళ్ళ సినిమా డ్యూరేషన్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారు.

ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సితార ఎంటర్టైన్మెంట్ లో వచ్చే కొన్ని సినిమాల సంబంధించి డ్యూరేషన్ విషయంలోనే పర్టికులర్ గా పట్టించుకుంటారు అని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇకపోతే విజయ్ చివరి సినిమా కాబట్టి ఈ సినిమా డ్యూరేషన్ ఇంత ఉంచారు. అనేది కొంతమంది నుంచి కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.

Also Read: Akhanda 2 Thaandavaam : అమరావతిలో అఖండ 2 ఈవెంట్, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు వాడతారా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×