E-Paper
Advertisement

Akhanda 2 Thaandavaam : అమరావతిలో అఖండ 2 ఈవెంట్, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు వాడతారా?

Akhanda 2 Thaandavaam : అమరావతిలో అఖండ 2 ఈవెంట్, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు వాడతారా?
Advertisement

Akhanda 2 Thaandavaam : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ కొంతమేరకు అభిమానులను సంతృప్తిపరిచింది. అయితే ఈ సినిమా విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే చాలావరకు ప్రాబ్లం అయింది. మొత్తానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తే ఏ ఏ అంశాలు అభిమానులు కోరుకుంటారో వాటన్నిటినీ కూడా కొంతమందికి ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు బోయపాటి.

ఈరోజుల్లో ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సక్సెస్ ఈవెంట్ అనేది ఆరోజు సాయంత్రానికే జరపడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను అమరావతిలో ఎల్లుండి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుంది. బహుశా దీనిని రేపే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వాడుతారా?

Advertisement

అయితే రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమాకి సంబంధించి కలెక్షన్లు తగ్గుతున్నాయి ఆదరణ తగ్గిపోతుంది అనుకునే టైంలో ఈవెంట్ చేసి ఆ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేయడం అనేది ఆనవాయితీగా మారుతుంది. ఇక అఖండ సినిమాకు సంబంధించి బయట ఎక్కడ పెద్దగా ఒక రేంజ్ లో వినిపించడం లేదు.

అందుకోసమే ఈ సినిమా ఒకసారి గ్రాండ్ ఈవెంట్ చేస్తే ఇక ప్రమోషన్ కూడా పనికొస్తుంది అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అమరావతిలో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో బాలయ్య బాబుకి ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్.

Advertisement

అయితే బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సినిమా అనేది చివరి నిమిషంలో రిలీజ్ కాకుండా ఆగిపోవడం అనేది ఊహించని పరిణామం. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు ఒక పలుకుబడి ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు అనే కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ వచ్చాయి. చాలామంది పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అయితే అప్పుడు వాడని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ను ఇప్పుడు ఈవెంట్ చేసి అమరావతిలో వాడుతారా అనే కామెంట్స్ ఎప్పుడు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వస్తారా? 

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎంతలా మాట్లాడారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ సినిమా కూడా మెయిన్ పాయింట్ సనాతన ధర్మము గురించి చెప్పడమే. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేయటం కానీ అలానే ఎక్కడ మాట్లాడటం కానీ జరగలేదు. బహుశా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రెండ్షిప్ వలన ఈ సినిమాకి హాజరై సనాతన ధర్మం గురించి అక్కడ మాట్లాడుతారేమో చూడాలి.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త హెయిర్ స్టైల్ వెనక రహస్యం ఏదైనా, తేరి రీమేక్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×