E-Paper
Advertisement

Vaishanv Tej: ఎట్టకేలకు ఈ మెగా హీరోకి డైరెక్టర్ దొరికేశాడు.. ఇంతకి రౌడీ ముందా? వైష్ణవ్ ముందా?

Vaishanv Tej: ఎట్టకేలకు ఈ మెగా హీరోకి డైరెక్టర్ దొరికేశాడు.. ఇంతకి రౌడీ ముందా? వైష్ణవ్ ముందా?
Advertisement

Vaishnav Tej With Vikram K Kumar: ఎంట్రీతోనే వంద కోట్ల సినిమాను ఖాతాలో వేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తన డెబ్యూ చిత్రం ఉప్పెన ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ఆకట్టుకుంది. ఇందులో వైష్ణవ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మౌత్ టాక్ తోనే థియేటర్లలో దూసుకుపోయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు చేసింది.

వరుసగా డిజాస్టర్స్

Advertisement

డెబ్యూ ఈ మూవీనే ఈ రేంజ్ లో హిట్ కొట్టడంతో వైష్ణవ్ పేరు మారుమ్రోగింది. దీంతో వైష్ణవ్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కట్టారు. కొండపొలం, రంగ రంగ వైభవంగా, అది కేశవ వంటి చిత్రాలు చేశాడు. అయితే ఇవి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. వరుసగా మూడు ప్లాప్స్ పడ్డాయి. ఇవి వచ్చి రెండు మూడేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు వైష్ణవ్ నుంచి మరో మూవీ అప్డేట్ రాలేదు. కనీసం సినిమాలకు కమిటైనట్టు వార్తలు కూడా వినిపించడం లేదు. దీంతో ఈ మెగా హీరో నుంచి మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఫ్యాన్స్ అంత ఎదురుచూస్తున్నారు. అయితే వైష్ణవ్ తన నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

విజయ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్

చిత్రాల రిజల్ట్స్ రిపీట్ అవ్వకుండ ఉప్పెన లాంటి హిట్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడట. అందుకే స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో కథలు తన దగ్గరికి వచ్చిన నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడట. ఇక ఇప్పుడు విక్రమ్ కే కుమార్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఇంకా స్క్రిప్ట్ ఎంపికలోనే ఉందటకాంబో. వైష్ణవ్ ఎప్పటికప్పుడు కొత్త కథలు వింటున్నాడట. కానీ,ఇప్పటి వరకు ఏది ఫైనల్ కాలేదట. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ వైష్ణవ్ కి కథ వినిపిస్తున్నాడట. అంత ఒకే అయితే ఈ కాంబో ఫైనల్ అయినట్టే అని తెలుస్తోంది. మరోవైపు విక్రమ్ కే కుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు.

త్వరలోనే అనౌన్స్మెంట్

Advertisement

దీనిపై ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. దీంతో ప్రస్తుతం విక్రమ్ విజయ్ దేవరకొండ తో మూవీ స్క్రిప్ట్ కూడా పూర్తయ్యింది. రౌడీ జనార్థన్ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇక గ్యాప్ వైష్ణవ్ తేజ్ కోసం ఓ సాలిడ్ స్టోరీ సిద్ధం చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. ఈ మెగా హీరో కోసం కొత్త కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. కాగామ‌నం, 24, 12బీ, ఇష్క్‌ వంటి చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు విక్రమ్ కే కుమార్. ఆ తర్వాత థాంక్యూతో డిజాస్టర్ చూసి విక్రమ్.. నాగ చైతన్యతో దూత అనే వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాడు. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు. లాంగ గ్యాప్ తర్వాత విజయ్ తో మూవీ ప్రకటించాడు. ఇప్పుడు ఈ మెగా హీరోని తన స్క్రిప్ట్ తో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడట.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×