E-Paper
Advertisement

ట్రైలర్ తో రికార్డ్ సృష్టించబోతున్న యశ్!

ట్రైలర్ తో రికార్డ్ సృష్టించబోతున్న యశ్!
Advertisement

Toxic: కేజీఎఫ్ 1,2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న యశ్ (Yash) కేజీఎఫ్ 2 తర్వాత రెండేళ్లు విరామం తీసుకొని ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో నయనతార(Nayanthara ) , కియారా అద్వానీ (Kiara Advani), తారా సతారియా(Tara sutharia), హ్యూమా ఖురేషి (Huma Qureshi), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఇలా దాదాపు 5 మంది హీరోయిన్లు నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో డబ్బింగ్ వర్షన్లలో విడుదల చేయబోతున్నారు.

టాక్సిక్ నుండి ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..

ఆగస్టు 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఆగస్టు 8వ తేదీన బెంగళూరులో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ కి ముందు ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకునేలా ఈ ఈవెంట్ ని నిర్వహించాలని అటు నిర్మాణ సంస్థ కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో యశ్ ట్రైలర్ తో ఒక సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమయ్యారు.

ట్రైలర్ తో రికార్డు సృష్టించబోతున్న టాక్సిక్..

Advertisement

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్ సినిమా ట్రైలర్ ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 40 కి పైగా భాషలలో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఇక ఇదే గనుక జరిగితే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇన్ని భాషలలో ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్రంగా టాక్సిక్ నిలవబోతోంది అని చెప్పవచ్చు.

ALSO READ:హీరో రిషబ్ శెట్టికి ప్రతిష్టాత్మక అవార్డు.. హీరో రియాక్షన్!

సినిమాపై భారీ అంచనాలు..

Advertisement

ఇకపోతే ఇప్పటికే సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, టీజర్, హీరోయిన్స్ తో రొమాంటిక్ పాటలు నెట్టింట వైరల్ కాగా.. ట్రైలర్ తో అంచనాలు పెంచాలని టీమ్ భావిస్తోంది. ఇకపోతే ఇటీవల యశ్ మాట్లాడుతూ.. ఇందులో బలమైన ఎమోషన్స్ ఉన్నాయని చెప్పిన ఈయన థియేటర్లలో ఆ ఎమోషన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు అని కూడా తెలిపారు. అంతేకాదు యాక్షన్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, అందులో భాగంగానే టాక్సిక్ లో హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ జేజే పెర్రీ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని స్పష్టం చేశారు. పైగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న తొలి కమర్షియల్ మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

టాక్సిక్ మూవీ విశేషాలు..

ఇకపోతే ఈ సినిమాలో నయనతార గంగ అనే ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తుండగా.. ఇందులో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉండనుంది అని.. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉండనుంది అని సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×