// // Champion Movie Trailer : శ్రీకాంత్ కొడుకు నటించిన ఛాంపియన్ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Champion Movie Trailer : శ్రీకాంత్ కొడుకు నటించిన ఛాంపియన్ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే?

Champion Movie Trailer : శ్రీకాంత్ కొడుకు నటించిన ఛాంపియన్ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే?
Advertisement

Champion Movie Trailer : ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్. ఈ సినిమా మీద విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వైజయంతి బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది.

ఛాంపియన్ ట్రైలర్ టాక్

ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వైజయంతి మూవీ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది అని ఆ గ్రాండియర్ ఆ పిరియాడిక్ విజువల్స్ చూస్తుంటే అర్థమయిపోతుంది. ముఖ్యంగా రోషన్ మేక మరియు అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. కేవలం అద్భుతమైన పాటలను అందించడం మాత్రమే కాకుండా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మిక్కిజే మేయర్ ఈ సినిమాకి అందించాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Advertisement

ఈ కథ 1948లో పుట్టింది. 2025లో చెబుతున్నాము అని ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఈ ట్రైలర్ లో ప్రముఖ నటులు కోవై సరళ, సీనియర్ హీరో నరేష్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ యాసలో రోషన్ అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అన్నిటిని మించి తెలుగు డబ్బింగ్ చెప్పిన అనస్వర స్పెషల్ ఎట్రాక్ట్ గా నిలిచింది. ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాలో రాజారెడ్డి అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

క్రిస్మస్ కానుకగా 

Advertisement

ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పుడు అధికారికంగానే ప్రకటించారు. డిసెంబర్ 25న విడుదల కాబోయే సినిమాలన్నిటికంటే కూడా ఈ సినిమా మీద విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read : Pawan Kalyan: సుజీత్ కు పవన్ కళ్యాణ్ కారు ఇవ్వడానికి ఇదే కారణం, సినిమా కోసం సుజీత్ అంతకు తెగించాడా?

Related News

తప్పని తెలుసుకున్న సమంత.. కోట్ల రూపాయల నష్టం!

తండ్రి చేతుల మీదుగా క్లాప్స్ కొట్టిన రామ్ చరణ్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

‘వారణాసి ‘ తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమాలు ఇవే..

చిత్రసీమలో విషాదం.. భరత్ కపూర్ మృతి వెనుక అసలు కారణం?

ఆదా శర్మలో ఈ టాలెంట్ ఉందా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

85 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉండటానికి కారణం చెప్పేసిన అలనాటి స్టార్

9 మందితో ఎఫైర్స్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి.. వెండితెర ‘రెండో భార్య’ రియల్ లైఫ్ విషాదం!

27 ఏళ్ల తర్వాత వెండితెరపై మ్యాజిక్.. నాగార్జున ‘కింగ్ 100’లో టబు రీ-ఎంట్రీ ఫిక్స్!

Big Stories

Advertisement
×