// // The kerala  Story 2 : ది కేరళ స్టోరీ 2 టీజర్ రిలీజ్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

The kerala  Story 2: ది కేరళ స్టోరీ 2 టీజర్ రిలీజ్..ఆదా శర్మ తప్పుకున్నట్టేనా?

The kerala  Story 2: ది కేరళ స్టోరీ 2 టీజర్ రిలీజ్..ఆదా శర్మ తప్పుకున్నట్టేనా?
Advertisement

The kerala  Story 2 Teaser: ది కేరళ స్టోరీ 2023వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్ పూర్తిగా కనుమరుగవుతున్న తరుణంలో నటి ఆదాశర్మ(Aadhaa Sharma) ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ సృష్టించినది కేరళ స్టోరీ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ సీక్వెల్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా ది కేరళ స్టోరీ సీక్వెల్ (The Kerala Story 2)సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

మన కూతుర్లు ప్రేమలో పడరు..

ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సీక్వెల్ సినిమాలో ఆదాశర్మకు బదులుగా ఉల్కా గుప్తా(Ulka Gupta) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే 2.06 నిడివితో విడుదలైన ఈ టీజర్ సినిమా పట్ల మంచి అంచనాలను రేకెత్తిస్తోంది.’ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ పేరుతో విడుదలైన ఈ టీజర్ లో..”మన కూతుళ్లు ప్రేమలో పడరు, వారు ఉచ్చులలో పడతారు. అబ్ సహేంగే నహీ… లాడేంగే” అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ఉంది.

ప్రధాన పాత్రలో ఉల్కా గుప్తా..

Advertisement

ఈ టీజర్ లో ముగ్గురు మహిళలు వారి గురించి తెలియజేస్తూ..కేరళకు చెందిన సురేఖా నాయర్ ఐఏఎస్ కావాలని భావించారు అలాగే మధ్యప్రదేశ్ కి చెందిన నేహా సంత్ జావెలిన్ త్రో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిత్యం వహించాలని కోరుకున్నారు ఇక రాజస్థాన్ కి చెందిన దివ్య పలివాల్ డాన్స్ ఇష్టపడటమే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలని కోరుకున్నట్టు ఈ టీజర్ వీడియోలో చూపించారు. భావించారు. ఈ ముగ్గురు అమ్మాయిల పాత్రలలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజ నటించారు. ఈ ముగ్గురు ఈ టీజర్ వీడియోలో బుర్ఖా వేసుకొని నుదుటిన తిలకంతో కనిపించడం సినిమా పట్ల ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ టీజర్ ద్వారా ఈ సినిమాలో ఆదాశర్మ నటించలేదని విషయాన్ని కూడా చిత్ర బృందం స్పష్టం చేశారు.

Advertisement

ఇక ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్నది కేరళ స్టోరీ 2 ఎలాంటి సంచలనాలను సృష్టించబోతుందో తెలియాల్సి ఉంది. ఇక ది కేరళ స్టోరీ సినిమా విడుదల సమయంలో కొన్ని వివాదాలు ఎదురయ్యాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు అయినప్పటికీ ఈ సినిమా మాత్రం భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంది.

Also Read: Big Tv Kissik Talks Promo: తండ్రికి క్యాన్సర్.. కష్టాల కడలిలో డెమోన్.. భరించే వారికే అంటూ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×