E-Paper
Advertisement

Margot Robbie: రూ.74 కోట్ల తాజ్ మహల్ డైమండ్ హారంతో మార్గోట్ రాబీ.. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అరుదైన ఆభరణం..!

Margot Robbie: రూ.74 కోట్ల తాజ్ మహల్ డైమండ్ హారంతో మార్గోట్ రాబీ.. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అరుదైన ఆభరణం..!
Advertisement

Margot Robbie:  హాలీవుడ్ నటి మార్గోట్ రాబీ ఇటీవల ధరించిన ఒక అరుదైన ఆభరణం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం వదరింగ్ హైట్స్.. ప్రమోషన్లలో భాగంగా లాస్ ఏంజెలెస్‌లో జరిగిన వరల్డ్ ప్రీమియర్‌కు హాజరయ్యారు. ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు ఎంత అందంగా ఉన్నాయో..ఆమె మెడలో ఉన్న హారం అంతకంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది.

మార్గోట్ రాబీ ధరించిన ఈ హారం సాధారణ జ్యువెలరీ కాదు. ఇది హాలీవుడ్ దిగ్గజ నటి ఎలిజబెత్ టేలర్కు చెందిన ప్రసిద్ధ తాజ్ మహల్ డైమండ్ నెక్లెస్. దీని విలువ దాదాపుగా రూ.74 కోట్లకు పైగా ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ హారం గుండె ఆకారంలో ఉండే ప్రత్యేకమైన డైమండ్‌తో తయారు చేయబడింది.

Advertisement

ఈ డైమండ్‌పై “Love is Everlasting” అనే వాక్యం చెక్కబడి ఉంది. అంటే ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుందనే భావన. ఈ ఒక్క లైన్‌నే ఈ హారాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. అంతేకాదు, ఈ డైమండ్‌పై మొఘల్ కాలానికి చెందిన గుర్తులు కూడా ఉన్నాయని ఆభరణ నిపుణులు చెబుతున్నారు.

ఈ డైమండ్‌కు ఉన్న చరిత్ర చాలా గొప్పది. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముమ్తాజ్ మహల్కు ఇచ్చిన ఆభరణమని నమ్మకం. ముమ్తాజ్ మహల్ జ్ఞాపకంగా నిర్మించిన తాజ్ మహల్ కారణంగా ఈ డైమండ్‌ను తాజ్ మహల్ డైమండ్గా పిలుస్తారు. ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్ మహల్‌తో దీనికి ఉన్న అనుబంధం ఈ హారానికి మరింత విలువను తీసుకొచ్చింది.

Advertisement

చాలా సంవత్సరాల తర్వాత ఈ డైమండ్ ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ చేతికి వచ్చింది. కార్టియర్ సంస్థ దీనిని బంగారం, రూబీలు కలిపి అద్భుతమైన హారంగా మార్చింది. 1972లో ప్రముఖ నటుడు రిచర్డ్ బర్టన్ తన భార్య ఎలిజబెత్ టేలర్‌కు 40వ పుట్టినరోజు కానుకగా ఈ హారాన్ని ఇచ్చారు. అప్పట్లో ఇది హాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది.

ఇప్పుడు అదే హారాన్ని మార్గోట్ రాబీ ధరించడం మరోసారి చరిత్రను గుర్తు చేసింది. రెడ్ కార్పెట్‌పై ఆమె ఈ హారాన్ని చోకర్ స్టైల్‌లో ధరించి, వెనుక వైపు వేలాడేలా స్టైలింగ్ చేశారు. ఈ హారం తనకు ఎంతో రొమాంటిక్ ఫీలింగ్ ఇచ్చిందని మార్గోట్ రాబీ మీడియాతో చెప్పింది.

ఒక ఆభరణం మొఘల్ సామ్రాజ్యం నుంచి హాలీవుడ్ రెడ్ కార్పెట్ వరకు ప్రయాణం చేయడం నిజంగా ఆశ్చర్యమే. మార్గోట్ రాబీ ఈ హారంతో పాత చరిత్రను కొత్త తరం ప్రేక్షకులకు పరిచయం చేసినట్టయ్యింది. ప్రేమ, చరిత్ర, విలాసం అన్నీ కలిసిన ఈ తాజ్ మహల్ డైమండ్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ALSO READ:  Donald Trump Wife Melania Documentry: రికార్డ్ స్థాయి చెత్త అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకున సినిమా.. కేవలం 2 టికెట్లే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×