E-Paper
Advertisement

Actor Sivaji : మరో వివాదంలో నటుడు శివాజీ.. మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు..

Actor Sivaji : మరో వివాదంలో నటుడు శివాజీ.. మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Actor Sivaji : టాలీవుడ్ నటుడు శివాజీ ఈమధ్య అనుకోని వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. మొన్నమధ్య మహిళల వస్త్రధారణ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని లేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. దాన్నింకా జనాలు మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం నటించిన చిత్రం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని.. ఇటీవలే రిలీజ్ అయింది. అయితే అనుకున్నా ఫలితాన్ని అందుకోలేక పోయింది. కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.. ఈ క్రమంలో హీరో శివాజీ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆయన సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మాట్లాడారు. అంతే కాదు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. అసలు శివాజీ ఏం మాట్లాడారో అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 

తాజాగా నటుడు శివాజీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. లో ఆయన మాట్లాడుతూ.. తన సినిమా పై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరో శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సినిమా ప్లాప్ అయిందని మిక్స్డ్ టాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇదంతా తనపై పేటీఎం బ్యాచ్ కుట్ర అన్న శివాజీ అంటున్నారు.. తన సినిమా వారం రోజులకు అయినా జనానికి ఎక్కుతుందన్న హీరో శివాజీ ఆ వీడియోలో తెలిపారు. నన్ను ఎవరు ఏం పీకలేరు సినిమా ఖచ్చితంగా కొద్ది రోజుల కైనా మంచి టాక్ ని అందుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు..

Advertisement

Also Read :‘బ్రహ్మముడి’ ఐశ్వర్య రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

మాజీ సీఎం జగన్ పై కామెంట్స్.. 

ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కేసులున్న వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరతానన్న శివాజీ అన్నారు.. మాజీ సీఎం జగన్ తన పేటీఎం బ్యాచ్ ద్వారా తన సినిమాపై తప్పుడు ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సినిమా బాగోలేదని రిలీజ్ కి ముందే రివ్యూలు రాయించారన్న శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైన కూడా నా సినిమాని ఆపగలరు కానీ శివాజీని ఆపలేరన్న నటుడు తెలిపారు. జగన్ సీఎం గా ఉన్నపుడే తనని ఏమీ చేయలేకపోయారని ఇప్పుడు మాత్రం ఏమీ చేయగలుగుతారని మండిపడ్డారు. మొత్తానికి ఇది మరోసారి వివాదంలో మారేలా కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మొన్నటికీ వివాదం నుంచి బయటికి రావడానికి శివాజీకి చాలా టైం పట్టింది. మరి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.. ప్రస్తుతం ఆయన సినిమాల విషయానికొస్తే… గతంలో దండోరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి హిట్ టాక్ని అందుకుంది.. రీసెంట్గా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిన మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా పర్వాలేదని టాక్ ని సొంతం చేసుకుంది. మరి శివాజీ అన్నట్లు సినిమా మరో వారం లైన కలెక్షన్లు పెరుగుతాయి ఏమో చూడాలి…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×