E-Paper
Advertisement

Nandamuri Thaman: బాలయ్యతో ఆరోసారి.. బోర్ కొట్టిందా.. బంతాడేస్తారు

Nandamuri Thaman: బాలయ్యతో ఆరోసారి.. బోర్ కొట్టిందా.. బంతాడేస్తారు
Advertisement

Nandamuri Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో హిట్ కాంబోస్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఒకసారి పని చేసిన వారితో వెంటనే పనిచేయడం జరగట్లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఒక డైరెక్టర్ సినిమా చేశాడు అంటే ఆయనకి అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ నే పెట్టుకునేవాడు. అలానే హీరోలకు అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. అప్పట్లో చిరంజీవి – మణిశర్మ మంచి కాంబో అని చెప్పుకొచ్చేవారు. అలాగే రవితేజ – చక్రి ఇలా హీరోకి మ్యూజిక్ డైరెక్టర్ కి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఇక ఇప్పుడు హీరోలు మ్యూజిక్ డైరెక్టర్ తో అంతలా బాండింగ్ పెంచుకోవట్లేదు అని చెప్పొచ్చు.

ఒక సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే ఇంకో సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొస్తున్నారు. అయితే ఒకే హీరోతో ఆరు సినిమాలు వరుసగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్  పేరు రికార్డు సృష్టించింది అని చెప్పొచ్చు. ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబోకి ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆరో సినిమాకి ముహూర్తం ఖరారైంది. థమన్ వీరసింహారెడ్డి తర్వాత నుంచి నందమూరి థమన్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబో 2016లో డిక్టేటర్ సినిమాతో మొదలైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా 2021 లో వచ్చిన అఖండ సినిమాతో ఈ కాంబో సెన్సేషన్ సృష్టించింది.

Advertisement

అఖండ తర్వాత వీరిద్దరికి తిరుగులేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరసింహారెడ్డి, భగవంతు కేసరి, డాకు మహారాజు వచ్చేనెల రిలీజ్ అవ్వాల్సిన అఖండ2 సినిమాలకు థమన్  మ్యూజిక్ అందించాడు. దీంతో వీరిద్దరూ కలిశారంటే హిట్ కంపల్సరీ అని నిర్ధారణకు వచ్చేస్తున్నారు అభిమానులు.  బాలయ్య అంటే థమన్ కి పూనకాలు వచ్చేస్తాయి. బాలయ్య సినిమాకు థమన్ తప్ప వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి మ్యూజిక్ అందించడు అని పేరు ఉంది. కానీ, అఖండ 2 కి మాత్రం కొద్దిగా ఆ హైట్ తగ్గింది అని చెప్పొచ్చు. అఖండ 2 రిలీజ్ అయిన జాజికాయ సాంగ్ ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేదు. అంతకుముందు సినిమాల్లో విన్న సాంగ్ లాగానే అనిపించిందని నెటిజన్స్ పెదవి విరిచారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కొద్దిగా నిరాశకు గురయ్యారు. ఇక ఇది కాకుండా ది రాజా సాబ్ సినిమాలో రెబల్ సాబ్ సాంగ్ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో ప్రేక్షకులు థమన్ పై ఫైర్ అయ్యారు.

థమన్  మ్యూజిక్ బోర్ కొట్టేసిందని ఎప్పుడూ అవే ట్యూన్స్  తో ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇప్పుడు బాలకృష్ణ 111 సినిమాకు కూడా థమనే  మ్యూజిక్ అందించడం విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆరవసారి బాలకృష్ణకు మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశాడు. దీంతో ఈసారి కూడా బాలయ్యకు నిరాశపరిచే మ్యూజిక్ ఇస్తే కనుక థమన్ ని కచ్చితంగా ఫాన్స్ బంతాడేస్తారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈసారైనా తమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొత్త ట్యూన్స్ ఇస్తే తప్ప విమర్శల నుంచి బయటపడలేడు అని చెప్పొచ్చు మరి థమన్  ఏం చేస్తాడు అనేది చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×