E-Paper
Advertisement

Sailu Kampati: రాజు వెడ్స్ రాంబాయి ఎఫెక్ట్..చిరుతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

Sailu Kampati: రాజు వెడ్స్ రాంబాయి ఎఫెక్ట్..చిరుతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!
Advertisement

Sailu Kampati: సాయిలు కంపాటి పేరు ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఈయన దర్శకత్వంలో ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మెగా 158 లో సాయిలు కంపాటి…

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దర్శకుడు బాబి (Bobby)ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబి ఊహించని విధంగా దర్శకుడు సాయిలు కంపాటి(Sailu Kampati)కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. బోసు నేను ఈ స్టేజ్ మీద నుంచి అడుగుతున్నాను నేను నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)గారితో చేయబోయే సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు అంటూ అడగగా వెంటనే సాయిలు కంపాటి సంతోషం వ్యక్తం చేస్తూ నటించడానికి సిద్ధమయ్యారు. ఇలా ఈ సినిమా ద్వారా ఏకంగా చిరంజీవితో నటించే అవకాశాన్ని అందుకోవటం విశేషం.

సంక్రాంతికి రాబోతున్న శంకర వరప్రసాద్ గారు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ చిరంజీవి బాబి డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

వాల్తేరు వీరయ్య..

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక నాయర్ నటించబోతున్నారని, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా భాగం కాబోతున్నారటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు నిజం కాదని, త్వరలోనే అన్ని విషయాలను అధికారకంగా తెలియజేస్తామని చిత్రబృందం వెల్లడించారు. ఇక ఇదివరకే చిరంజీవి బాబి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతోనే చిరంజీవి మరోసారి బాబీకు అవకాశం ఇచ్చారు. చిరంజీవి ఈ సినిమాతో పాటు నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా మరో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. నాని ది ప్యారడైజ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది.

Also Read: NBK 111: మహారాజుగా బాలకృష్ణ… ఏమా తేజస్సు ఏమా టీవీ ఏమా రాజసం…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×