E-Paper
Advertisement

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీఎం వారసుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీఎం వారసుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడా?
Advertisement

Film industry:సినిమాలలోకి సెలబ్రిటీల వారసుల రాక అందరిలో క్యూరియాసిటీని పెంచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతుంటే.. మరొకవైపు కోలీవుడ్ సెలబ్రిటీల వారసులు కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక సీఎం వారసుడు హీరోగా అవతరించనున్నారు. ఇప్పటికే ఆయన డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి , తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయడానికి హీరోగా అవతరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారెవరో ఎప్పుడు చూద్దాం.

ఆ సీఎం ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈయన.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా కూడా నిలిచారు. ఇప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. ఆయన కుమారుడు హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే సిగ్మా చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్ కొడుకు జేసన్ సంజయ్, ప్రస్తుతం నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్న సీఎం వారసుడు..

Advertisement

ఈ మేరకు కోలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో జేసన్ సంజయ్ హీరోగా తన కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఎవరు అనే విషయం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. పైగా త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘పరి మాలా అండ్ కో’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన తమిళ్ కుమరన్ నిర్మించబోతున్నట్లు సమాచారం . పైగా ఈ ప్రాజెక్టు ద్వారా విజయ్ వారసుడు జేసన్ సంజయ్ పూర్తిస్థాయి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్తలు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి.

ALSO READ:తనకంటే 16 ఏళ్ల చిన్నమ్మాయితో పెళ్లి.. సోషల్ మీడియా ట్రోల్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఆవేదన!

తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తారా?

Advertisement

ఇకపోతే అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సిగ్మా సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ఈయన..ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తే కచ్చితంగా హిట్ కొడతాడనే కామెంట్లు విజయ్ ఫ్యాన్స్ నుంచీ వ్యక్తమవుతున్నా.. మరొకవైపు తన తండ్రి స్థానాన్ని రీప్లేస్ చేస్తాడా? లేదా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. మరి ఇలాంటి చర్చకు తెరపడాలి అంటే హీరోగా సంజయ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలి. తన నటనతో ఆకట్టుకోవాలి. అప్పుడే అనుకున్న కలలు నిజమవుతాయని విజయ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ చివరి సినిమా..

విజయ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఆయన నటించిన చిత్రం జననాయగన్. ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణాలవల్ల ఈనెల 24వ తేదీకి వాయిదా పడింది.. ఏడు నెలల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది . మరి విజయ్ చివరి సినిమాగా రాబోతున్న జననాయగన్ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? విజయ్ కి చివరి సినిమాగా ఏ విధంగా నిలిచిపోతుంది ? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×