E-Paper
Advertisement

తిరుమల తొలి హారతి వివాదం.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ స్పందన ఏంటి?

తిరుమల తొలి హారతి వివాదం.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ స్పందన ఏంటి?
Advertisement

DK Shivakumar: రాజకీయాల కోసం దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదు. సాక్షాత్తూ ఆ ఏడుకొండల వాడిపై పెత్తనం చెలాయించడానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఓట్ల కోసం, సీట్ల కోసం దేవుడి సంప్రదాయాలను కూడా వాడుకుంటారా? రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని తాకట్టు పెడతారా? డీకే శివకుమార్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహమేంటి? ఈ ఇష్యూపై టీటీడీ రియాక్షన్ ఏంటి?

తిరుమల సంప్రదాయాలకు విరుద్ధంగా కర్ణాటక సీఎం..

Advertisement

తిరుమలలో ప్రతి పూజ వెనుక ఒక పరామర్థం ఉంటుంది. ప్రతి సంప్రదాయం వెనుక చారిత్రక నేపథ్యం ఉంటుంది. కానీ ఆ సంప్రదాయలను అడ్డం పెట్టుకొని ఏదైనా చేస్తామంటే ఆ దేవుడు సహించడు.. భక్తులు ఒప్పుకోరు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఇప్పుడు తిరుమల సంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్తానంటున్నారు. విజయనగర సామ్రాజ్య రాజులు, మైసూర్ మహారాజులు చేసిన తిరుమల ఆలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.

అధికారులకు కూడా కల్పిస్తాం..

Advertisement

అందుకే శ్రీవారికి సమర్పించే తొలి హారతిని స్వీకరించే గౌరవం మైసూరు రాజవంశానికి దక్కింది. స్వాతంత్రయం అనంతరం ఆ సంప్రదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది. కర్ణాటక సీఎం గర్భాలయం వెలుపల కులశేఖరపడి వరకు వెళ్లి రాష్ట్ర ప్రజల తరఫున తొలి హారతిని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి హాజరుకాలేని సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఈ అవకాశాన్ని ఇప్పుడు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు కూడా కల్పిస్తామంటున్నారు డీకే శివకుమార్.

Also Read: బంగాళాఖాతంలో పడవ బోల్తా.. 9 మంది మత్స్యకారులు మృతి, ఆరుగురి గల్లంతు!

డీకే శికుమార్ వ్యాఖ్యలు..

సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తిరుమల భక్తులు, హిందూ సంఘాలు, ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కర్ణాటక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి సంప్రదాయాలను వాడుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. తలొగ్గే ప్రసక్తి లేదంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి శంఖారావం పూరించడంతో ఈ అంశం పక్కా పొలిటికల్ టర్న్ తీసుకుంది.

అధికార పార్టీ ఆలోచన..

తిరుమల మొదటి హారతిపై హక్కు తమదేనని చెప్పడం ద్వారా కర్ణాటకలోని కన్నడిగుల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలనేది అక్కడి అధికార పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. మైసూర్ మహారాజుల కాలం నుంచి తిరుమల ఆలయానికి, కర్ణాటకకు చారిత్రక బంధం ఉందన్నది నిజం. కానీ ఆ చారిత్రక సేవలను, నేటి రాజకీయ అవసరాలకు వాడుకోవడంపైనే అసలు అభ్యంతరం వ్యక్తమవుతోంది. చారిత్రక ఆధారాల ప్రకారం కొన్ని రాష్ట్రాల రాజులు చేసిన సేవలకు గౌరవార్థం కొన్ని మర్యాదలు జరగవచ్చు. కానీ, వాటిని రాజకీయ ఆధిపత్య పోరాటాలుగా మార్చడం ముమ్మాటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే?

Also Read: తెలంగాణ అభివృద్ధికి 6 సూత్రాలు.. ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×