E-Paper
Advertisement

సినిమాల షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చిన తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్.. అదే కారణమా?

సినిమాల షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చిన తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్.. అదే కారణమా?
Advertisement

TFPC: ఇటీవల కాలంలో నటీనటులు తీసుకునే రెమ్యూనరేషన్ (Remunerations)కారణంగా చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక్కో హీరో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం నిర్మాతలకు తలకు మించిన భారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నటీనటుల పారితోషికాలు అలాగే పెరుగుతున్న నిర్మాణ ఖర్చులను తగ్గించే దిశగా తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాల షూటింగ్ నిలుపి వేతకు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో నటీనటుల రెమ్యూనరేషన్ ఇతర నిర్మాణ వ్యయం కారణంగా అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోతుంది.

నడిగర్ సంఘంతో చర్చలు విఫలం..

ఇలా అధిక బడ్జెట్ పెరిగిపోతున్న నేపథ్యంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తో చర్చలు జరిపారు. కొద్దిరోజులుగా ఈ చర్చలు జరుపుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు దీంతో నిర్మాతల మండలి ఈ “టోకెన్ స్ట్రైక్” చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా స్ట్రైక్ చేపట్టడం వెనుక ప్రధాన కారణం భారీగా పెరుగుతున్న నటీనటుల రెమ్యూనరేషన్లు అదేవిధంగా ప్రొడక్షన్ ఖర్చులను నియంత్రించే దిశగా ఒక పటిష్టమైన నిబంధనలను తీసుకురావాలని చిత్ర నిర్మాతలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

ఏకాభిప్రాయం లేకపోవడం..

Advertisement

గత కొద్ది రోజులుగా ఈ విషయంపై నడిగర్ సంఘంతో చర్చలు జరిపినప్పటికీ ఆశించిన ఫలితాలు రాని నేపథ్యంలో స్ట్రైక్ కు పిలుపునిచ్చారు ఇలా స్ట్రైక్ కారణంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలా నిర్మాతల మండలి ప్రకటించడానికి ప్రధాన కారణం రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు అలాగే నటీనటుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే నిర్మాతలు నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పాలి. సమ్మె చేపట్టడంతో నిర్మాతలు నటీనటుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? లేదంటే ఇలాగే సమ్మె కొనసాగిస్తూ పోతారా అనేది తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ కాకుండా సినిమా లాభాలలో వాటా..

Advertisement

ఇకపోతే నటీనటులకు నిర్మాతల మండలి కూడా కొన్ని కండిషన్లను విధించినట్లు తెలుస్తోంది. నటీనటులు పారితోషితం ఒకేసారి కాకుండా సినిమా లాభాలలో వాటా తీసుకొనే విధంగా ఒప్పందం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే సెలెబ్రెటీలు మరో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. నిర్మాతల నుంచి నటీనటులు లేదా సాంకేతిక నిపుణులు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతనే మరొక సినిమాకు వెళ్లాలని నిబంధనలు కూడా విధించారు. మరి ఈ వ్యవహారంలో నిర్మాతలు నటీనటులు ఏకతాటి పైకి వచ్చి షూటింగ్ పనులను తిరిగి ప్రారంభించుకుంటారా లేదంటే సమ్మెను ఇలాగే కొనసాగిస్తూ వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ శివ జ్యోతి.. పాప పేరు రివీల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×