E-Paper
Advertisement

Suriya -Rajamouli: రాజమౌళి ఆ సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్న సూర్య…షాక్ లో ఫ్యాన్స్!

Suriya -Rajamouli: రాజమౌళి ఆ సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్న సూర్య…షాక్ లో ఫ్యాన్స్!
Advertisement

Suriya -Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) సినిమా అంటేనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. సీరియల్ డైరెక్టర్ గా మొదలైన ఆయన ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. ఇక రాజమౌళితో సినిమా చేయాలి అనే ఆసక్తి ప్రతి ఒక్క హీరోకి ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలు రాజమౌళితో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మగధీర, విక్రమార్కుడు సూర్య చేయాల్సిందా?

రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో మగధీర(magadheera), విక్రమార్కుడు(Vikramarkudu) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలలో ముందుగా అనుకున్న హీరోలు రవితేజ, రామ్ చరణ్ కాదని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకు మొదటి ఎంపికగా నటుడు సూర్య(Suriya) అని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రాజమౌళి ఈ రెండు సినిమాల కథలు సిద్ధమైన తర్వాత ముందుగా నటుడు సూర్యతోనే చేయాలని అనుకున్నారట.

భాషాపరమైన అంశాలు..

Advertisement

ఈ కథలకు సూర్య అయితే సరిగ్గా సరిపోతారని భావించిన రాజమౌళి సూర్యతోనే చేయాలని అనుకున్నారట కానీ అప్పటి పరిస్థితులు, భాషా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని సూర్య కాకుండా తెలుగు హీరోలతోనే సినిమాలు చేయటం సరైన నిర్ణయం అని భావించి విక్రమార్కుడు సినిమా కోసం రవితేజను, మగధీర సినిమా కోసం రామ్ చరణ్ ను సంప్రదించి వారితో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇక ఈ విషయం ఇన్ని రోజులకు బయటకు రావడంతో సూర్య అభిమానులు షాక్ లో ఉండిపోయారు. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలను సూర్యతో చేయాలనుకుని చేయలేకపోయారా? ఒకవేళ రాజమౌళి కనక ఈ సినిమాలను సూర్యతో చేసి ఉంటే ఆయన కెరియర్ వేరే స్థాయిలో ఉండేదని సూర్య అభిమానులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో ఆయన రాజమౌళి ఛాన్స్ ఇస్తారా?

Advertisement

ఇలా గతంలో సూర్యతో సినిమాలను విరమించుకున్న రాజమౌళి భవిష్యత్తులో అయినా రాజమౌళి సూర్యతో సినిమా చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సూర్య పేరుకే కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ డైరెక్టర్లతో సూర్య సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే సూర్య నటించిన కురుప్పు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమాతో పాటు ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా  చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సూర్య జిత్తు డైరెక్షన్లో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు.

Also Read: Naa Anveshana on Ibomma Ravi: ఐ బొమ్మ రవి దొంగ కాదు హీరో..హీరోలను ఏకి పారేసిన నా అన్వేష్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×