E-Paper
Advertisement

Maruti Suzuki: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

Maruti Suzuki: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!
Advertisement

Maruti Suzuki Winter Special Service : కస్టమర్ల కోసం మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా వింటర్ స్పెషల్ సర్వీస్ డ్రైవ్‌ను ప్రకటించింది.  చలి కాలంలో కస్టమర్లు తమ వాహనాలను కండీషన్ లో ఉంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రతి సీజన్ లో మాదిరిగా ఈసారి కూడా వినియోగదారులకు ఉచితంగా కార్ సర్వీస్ అందిస్తున్నట్లు తెలిపింది.  వాహన యజమానులకు తమ కార్లను చెక్ చేయించుకోవడంతో పాటు ఉచిత సర్వీస్, ఇతర ప్రత్యేక ప్రయోజనాలు పొంద వచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందడానికి దేశ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లు తమ సమీపంలోని ఆథరైజ్డ్ డీలర్ సర్వీస్ వర్క్‌ షాప్‌లకు వెళ్లాలని సూచించింది.

పూర్తి స్థాయిలో వాహనాల చెకింగ్

ఇక వింటర్ స్పెషల్ సర్వీస్ డ్రైవ్‌ లో భాగంగా కస్లమర్లకు పూర్తిగా 27 పాయింట్లతో కూడిన వాహన తనిఖీ ఉంటుంది. చలికాలంలో పరిస్థితుల కారణంగా తలెత్తే సమస్య గుర్తించడానికి ఈ పాయింట్స్ ఉపయోగపడుతాయి. ఈ డ్రైవ్ లో ఉండే చెకింగ్స్ కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ లైటింగ్ సిస్టమ్, అద్దాలు: పొగమంచు వింటర్ లో డ్రైవింగ్ సమయంలో విజుబులిటీని నిర్ధారించడానికి టెక్నికల్ ఎక్స్ ఫర్ట్స్ హెడ్‌ ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, బ్రేక్ లైట్లు, టర్న్ సిగ్నల్ సూచికలను తనిఖీ చేస్తారు.

⦿ హీటింగ్, వెంటిలేషన్: క్యాబిన్ సౌకర్యం, విజుబులిటీకి అవసరమైన బ్లోవర్ ఫ్యాన్, డీఫాగర్ స్విచ్ ఆపరేషన్‌ కు సంబంధించిన వివరాలను ఇందులో చెక్ చేస్తారు.

Advertisement

⦿ బ్యాటరీ హెల్త్: చల్లని వాతావరణ సమస్యలను నివారించడానికి బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ తో పాటు మొత్త బ్యాటరీ హెల్త్ ను చెక్ చేస్తారు.

⦿ టైర్లు, వీల్స్: ఈ సందర్భంగా కార్లకు సంబంధించిన టైర్ ప్రెజర్, వీల్ నట్ టార్క్, స్పేర్ వీల్‌ ను చెక్ చేస్తారు. ఏదైనా అసాధారణ పగుళ్లు ఉంటే చెక్ చేస్తారు.

⦿ బ్రేక్‌లు: బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్స్, బ్రేక్ పెడల్స్ కు సంబంధించి లీకేజీ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తారు.

⦿ ఫిల్టర్లు: ఎయిర్ ఫిల్టర్, AC ఫిల్టర్ కూడా తనిఖీల లిస్టులో ఉంచినట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

Read Also: ఆ కార్లు బార్డర్ దాటొద్దు, డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం!

అదనపు ఆఫర్లు, ప్రయోజనాలు

టెక్నికల్ చెకప్ తో పాటు, మారుతి సుజుకి కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ ను మెరుగుపరచడానికి మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తోంది.

⦿ కాంప్లిమెంటరీ కార్ వాష్: ఈ సర్వీస్ డ్రైవ్‌లో భాగంగా కస్టమర్లు కాంప్లిమెంటరీ కార్ వాష్‌ ను పొందవచ్చు.

⦿ మెయింటెనెన్స్ ఆఫర్లు: కంపెనీ పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ కోసం లేబర్ ఛార్జీలపై ఆఫర్లను అందిస్తోంది.

ఈ స్పెషల్ సర్వీస్ ఎప్పటి వరకు ఉంటుందంటే?

వింటర్ స్పెషల్ సర్వీస్ డ్రైవ్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంది. జనవరి 4, 2026 వరకు కొనసాగుతుంది. ఈ అవకాశం కేవలం మారుతి సుజుకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు, వర్క్‌ షాప్‌లలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Read Also: నిన్న BMW, నేడు బెంజ్.. మరింత ప్రియం కానున్న లగ్జరీ కార్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×