// // Sravanthi Chokkarapu: అల్లు అర్జున్ వల్లే అదంతా.. పవన్ కాదు -->
E-Paper
Advertisement

Sravanthi Chokkarapu: అల్లు అర్జున్ వల్లే అదంతా.. పవన్ కాదు, ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన స్రవంతి చొక్కారపు

Sravanthi Chokkarapu: అల్లు అర్జున్ వల్లే అదంతా.. పవన్ కాదు, ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన స్రవంతి చొక్కారపు
Advertisement

Sravanthi Chokkarapu:  యూట్యూబ్ ద్వారా ముందుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ స్రవంతి చొక్కారపు ఈ మధ్య కాలంలో మరింత ఫేమస్ అవుతోంది. ఆమె కెరీర్‌లో కీలక మలుపు వచ్చిన సందర్భాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పాపులారిటీకి అసలు కారణం ఎవరు అనే విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

స్రవంతి మొదట యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్‌గా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఆమె పేరు బాగా వినిపించింది. ఆ ఈవెంట్ తర్వాత టీవీ ప్రేక్షకుల్లో కూడా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

తర్వాత ఆమె బిగ్ బాస్ తెలుగులో పాల్గొనడం వల్ల ఇంటింటా తెలిసిన ముఖంగా మారింది. అంతేకాదు, ఇటీవల సుహాసిని హే బలవంత్ సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించి నటిగా కూడా తనను తాను పరిచయం చేసుకుంది.

తాజా ఇంటర్వ్యూలో స్రవంతి మాట్లాడుతూ, తనను నిజంగా ఫేమస్ చేసింది అల్లు అర్జున్తో చేసిన ఇంటర్వ్యూ అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ సరదాగా మాట్లాడటం, తాను కూడా ధైర్యంగా సమాధానాలు ఇవ్వడం వల్ల ఆ వీడియో బాగా వైరల్ అయిందని తెలిపింది. అలాగే ఒక చేనేత వస్త్రాల కార్యక్రమంలో అల్లు అర్జున్ తన చీరను ప్రశంసించిన వీడియోకి మిలియన్ల వ్యూస్ వచ్చాయని గుర్తు చేసుకుంది.

Advertisement

ఇంకా యాంకర్ ఆమెను “మీకు అల్లు అర్జున్ లక్కీ చార్మా, లేక పవన్ కళ్యాణ్ లక్కీ చార్మా?” అని అడిగితే, స్రవంతి చక్కగా సమాధానం చెప్పింది. ఇద్దరూ తనకు లక్కీనే అని, కానీ అల్లు అర్జున్‌తో ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఆయన వల్లే తనకు ఎక్కువ పాపులారిటీ వచ్చిందని స్పష్టంగా చెప్పింది.

ALSO READ: Spirit: స్పిరిట్ కొత్త పోస్టర్‌లో వివేక్ ఓబెరాయ్ పక్కన కనిపించిన స్టైలిష్ నటి ఎవరో తెలుసా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×