E-Paper
Advertisement

అక్కినేని కోడలా మజాకా…సముద్ర గర్భంలో శోభిత సాహసం చూశారా..

అక్కినేని కోడలా మజాకా…సముద్ర గర్భంలో శోభిత సాహసం చూశారా..
Advertisement

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం అక్కినేని ఇంటి కోడలిగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga chaitanya)తో గత ఏడాది శోభిత ఏడడుగులు నడిచి అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్న శోభిత (Sobhita)కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూనే తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ..

ఈ నేపథ్యంలోనే శోభిత స్కూబా డైవింగ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలలో భాగంగా ఈమె పడవలో కూర్చుని సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అదే విధంగా సముద్రపు గర్భంలోకి వెళ్లి అక్కడ అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

శోభిత స్కూబా డైవింగ్

Advertisement

ఈ విధంగా శోభిత స్కూబా డైవింగ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన అక్కినేని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సాహసాలకు హీరోయిన్లు కాస్త దూరంగా ఉంటారు కానీ శోభిత మాత్రం ఎలాంటి భయం లేకుండా ఎంతో ధైర్య సాహసాలతో సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడ అందాలను ఆస్వాదించడంతో అభిమానులు ఈ వీడియో పై ఫన్నీగా స్పందిస్తున్నారు. అక్కినేని కోడలా మజాకా.. అక్కినేని కోడలు అంటే ఈ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే ఈమె పెళ్ళికి ముందు పలు బాలీవుడ్ సినిమాలలో అలాగే పలు తెలుగు సినిమాలలో నటించారు. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంటుందని భావించారు కానీ ఈమె పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల చీకటిలో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేరుగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా చీకటిలో సినిమా ద్వారా శోభిత మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా శోభిత బిజీగా ఉన్నారు. ఇక ఈమెకు నాగచైతన్యత 2024 డిసెంబర్లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో వివాహం చేస్తున్నారు.

Also Read: పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ… కాబోయే భర్తను పరిచయం చేస్తూ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×