// // Rahul Sipligunj -Harinya wedding: అంగరంగ వైభవంగా రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యల వివాహం! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rahul Sipligunj -Harinya wedding: అంగరంగ వైభవంగా రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యల వివాహం!

Rahul Sipligunj -Harinya wedding: అంగరంగ వైభవంగా రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యల వివాహం!
Advertisement

Rahul Sipligunj -Harinya wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) సైతం తన ప్రేయసి హరిణ్య(Harinya)ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో నేడు ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన పాడిన పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం అంటే ఈయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పెళ్లి బంధంతో ఒకటైన రాహుల్ హరిణ్య..

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ రాజకీయ కుటుంబానికి చెందిన హరిణ్య అనే అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో గత రెండు నెలల క్రితం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకొని తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఇక నవంబర్ 27వ తేదీ ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. నేడు కుటుంబ సభ్యులు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహకు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను వీరిద్దరూ అధికారికంగా షేర్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.

సాంప్రదాయపద్ధంగా వివాహపు వేడుక..

Advertisement

సాంప్రదాయ దుస్తులలో వీరి వివాహం ఎంతో సాంప్రదాయపద్ధంగా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నేటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఎప్పటికప్పుడు వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేశారు. ఇటీవల మెహందీ, హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ విన్నర్…

Advertisement

ఇక వీరి సంగీత్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ క్రికెటర్ చాహల్ కూడా హాజరై సందడి చేశారు. హరిణ్యకు చాహల్ ఫేవరెట్ క్రికెటర్ కావడంతో రాహుల్ తన సంగీత్ కు చాహల్ ను ఆహ్వానించి తన భార్యకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్న ఈ జంట నేడు ఘనంగా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్ విషయానికి వస్తే ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని విన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈయన లవ్ బ్రేకప్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే అవన్నీ అవాస్తవమని స్పష్టమైనది. రాహుల్ ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు నడవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Shiva Jyothi: శివ జ్యోతికి టీటీడీ బిగ్ షాక్… జీవిత కాల నిషేధం…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×