E-Paper
Advertisement

Bangladesh News: వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు, ఈసారి ఢాకా వంతు, 1500 ఇళ్లు దగ్ధం

Bangladesh News: వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు, ఈసారి ఢాకా వంతు, 1500 ఇళ్లు దగ్ధం
Advertisement

Bangladesh News: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వల్ల కొరైల్ మురికివాడలో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు 1,500 గుడిసెలు మంటలకు ఆహుతి అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగింది?

ఢాకాలోని మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం

Advertisement

హాంకాంగ్.. ఆ తర్వాత బంగ్లాదేశ్.. ఇలా వేర్వేరు దేశాల్లో భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అతి పెద్ద కొరైల్ స్లమ్ ఏరియాలో ‌భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 1,500 గుడిసెలు కాలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఢాకాలోని మురికివాడ ప్రాంతాల్లో కోరైల్ అది పెద్దది. ఈ ప్రాంతంలో వేలాది మంది చిన్నచిన్న వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం వేళ కావడంతో అందరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

Advertisement

మంటల్లో 1500 ఇళ్లు, తప్పిన ప్రాణాపాయం

ఆ తర్వాత మంటలు స్లమ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాదాపు 1500 పూరిళ్లు తగలబడ్డాయి. అందులో నివసించే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 16 గంటల తర్వాత మంటలను గురువారం ఉదయం నాటికి అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి రషెద్ బిన్ ఖలీద్ తెలిపారు.  ఇరుకైన సందుల కారణంగా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఇబ్బంది పడ్డామని తెలిపారు.

అధికారిక సమాచారం మేరకు.. 160 ఎకరాల్లో 60 వేల కుటుంబాలు ఉంటున్నాయి. అందులో శరణార్థులుగా వచ్చినవారు ఉన్నారు. అందులోని ఎక్కువ మంది మురికివాడలో నివసిస్తున్నాయి. సాయంత్రం వేళ మంటలు నివాసాలను చుట్టుముట్టడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇళ్ళు కోల్పోయిన నివాసితులు.. మంటలకు కాలిపోయిన ఇళ్లు, తమ వస్తువులను సేకరించడానికి ప్రయత్నించారు.

ALSO READ: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అమెరికా

2024 నాటి లెక్కల ప్రకారం.. 10.2 మిలియన్ల జనాభా కలిగిన ఢాకాలో వేలాది మంది మురికివాడలో ఉంటున్నారు. పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధానికి వారంతా వలస వచ్చారు. రిక్షాలు, ఆటోలు నడపడం, ఇంటి పని మనిషులు, క్లీనర్‌గా ఇలా రకరకాల పనులపై వారంతా ఆధారపడి జీవిస్తారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×