E-Paper
Advertisement

బ్లాక్ బస్టర్ జవాన్ సీక్వెల్ కి సర్వం సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?

బ్లాక్ బస్టర్ జవాన్ సీక్వెల్ కి సర్వం సిద్ధం.. షూటింగ్  ఎప్పుడంటే?
Advertisement

Jawan 2: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రెండు కూడా మారిపోయింది. మొదటి భాగం కంటే సీక్వెల్స్ సంచలనాలు సృష్టిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2, ధురంధర్ 2 ఇలా వరుసగా చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ సిద్ధమయింది. అటు దర్శకుడు చెప్పిన కథకు హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఆ సినిమా ఏంటి దాని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

జవాన్ సీక్వెల్ కి సర్వం సిద్ధం..

అదేదో కాదు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్.. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ రేంజ్ ఇది అని నిరూపించిన సినిమా ఇది.. దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ ను డైరెక్టర్ అట్లీ సిద్ధం చేశారు. అలా సిద్ధంగా ఉంచిన స్క్రిప్టును షారుక్ ఖాన్ కి వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలలో వార్త వినిపిస్తోంది.

త్వరలో పట్టాలెక్కనున్న జవాన్ 2..

Advertisement

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఒక ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ హీరోని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రమైన కింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే జవాన్ 2 పట్టాలెక్కనుంది అని సమాచారం. ఇక అట్లీ విషయానికి వస్తే.. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రాకా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే అటు అల్లు అర్జున్ , షారుక్ ఖాన్ కలిసి కనిపించే తెర అభిమానులకు అతిపెద్ద పండుగ కానుంది. ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాగూర్ ,రష్మిక మందన్న, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ALSO READ:కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన బన్నీ.. మేనమామ చిరంజీవి ఇంటికి సమీపంలో.. ఎన్ని కోట్లంటే?

జవాన్ సినిమాతో సంచలనం సృష్టించిన షారుక్..

Advertisement

షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన జవాన్ సినిమా విషయానికొస్తే.. రూ. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారుగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.1,150 కోట్ల వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ చిత్రంలో షారుక్ ఖాన్, నయనతార , విజయ్ సేతుపతి ,ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×