E-Paper
Advertisement

Samantha Video Call: బాబు అంటూ భర్తను ముద్దుగా పిలిచిన సమంత.. నువ్వు ఇది కూడా చేస్తావా అంటూ ఆశ్చర్యపోయిన రాజ్..

Samantha Video Call: బాబు అంటూ భర్తను ముద్దుగా పిలిచిన సమంత.. నువ్వు ఇది కూడా చేస్తావా అంటూ ఆశ్చర్యపోయిన రాజ్..
Advertisement

Samantha Video Call:సమంత ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సమంతతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి కూడా పాల్గొంటున్నారు.

ఉగాది సందర్భంగా సమంత, నందిని రెడ్డి కలిసి యాంకర్ సుమతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో జరిగిన ఒక చిన్న సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ప్రోగ్రామ్ మధ్యలో సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే సమంత “హాయ్ బాబు” అని ప్రేమగా పలకరించింది. ఆమె ఆ ముద్దు పేరుతో పిలవడం చూసి అక్కడ ఉన్నవారంతా చిరునవ్వులు చిందించారు.

Advertisement

అప్పుడే సుమ, నందిని రెడ్డి సరదాగా “బాబు అంటే ఎవరు?” అని అడిగారు. దానికి సమంత నవ్వుతూ “అదే రాజ్” అని తను మాట్లాడుతున్న వీడియో కాల్ వాళ్ళవైపు చూపించింది. ఆ తరువాత సమంత “నీ కోసం ఉగాది పచ్చడి చేసాను” అని చెప్పింది.

దీనికి రాజ్ ఆశ్చర్యంగా స్పందిస్తూ “నువ్వే చేశావా నిజంగా?” అని కొంచెం సరదాగా అన్నాడు. సమంత కూడా వెంటనే “అవును నేనే చేసాను” అని చెప్పింది. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్నవారు అందరూ నవ్వేశారు.

తర్వాత రాజ్ ముగ్గురికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాడు. సుమ తెలుగులో మాట్లాడటంపై స్పందిస్తూ “ఇది మన తెలుగు న్యూ ఇయర్ కదా” అని చెప్పడం కూడా హైలైట్ అయింది. చివరగా సమంతతో మాట్లాడుతూ “నువ్వే చేసినట్లైతే తప్పకుండా తింటాను” అని చెప్పగా, సమంత కూడా చురుకుగా స్పందించింది.

మొత్తం పైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతోంది. సమంత-రాజ్ మధ్య ఉన్న ఈ క్యూట్ బాండింగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమా ప్రమోషన్స్‌తో పాటు ఇలాంటి సరదా క్షణాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ALSO READ: Samantha: అది తప్ప.. అన్నీ వచ్చు…. పాపం రాజ్.. పర్సనల్ విషయాలు బయటపెట్టిన సమంత..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×