E-Paper
Advertisement

Rukmini Vasanth: కాంతార ఎఫెక్ట్ బాలీవుడ్ ఛాన్సులు కొట్టేసిన రుక్మిణి వసంత్!

Rukmini Vasanth: కాంతార ఎఫెక్ట్ బాలీవుడ్ ఛాన్సులు కొట్టేసిన రుక్మిణి వసంత్!
Advertisement

Rukmini Vasanth: రుక్మిణి వసంత్ పరిచయం అవసరం లేని పేరు. కాంతార 1 సినిమా విడుదలకు ముందు వరకు రుక్మిణి వసంత్ పేరు చాలామందికి తెలియదు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఈమె పేరు మారుమోగిపోయింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార1 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రుక్మిణి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు సౌత్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగులు వేయటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

బాలీవుడ్ లోకి తొలి అడుగు..

బాలీవుడ్ అవకాశాలు పట్ల రుక్మిణి వసంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రుక్మిణి వసంత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాకు హిందీ చాలా సుపరిచితమైన భాష అని తెలిపారు. ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని, భగవంతుడి దయతో త్వరలోనే ఆ సినిమా పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తన బాలీవుడ్ డెబ్యూ మూవీ గురించి రుక్మిణి వసంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి..

Advertisement

ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ హీరో సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు కానీ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఈ విధంగా రుక్మిణి వసంత్ ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలను కూడా ఆదుకుంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

మణిరత్నం డైరెక్షన్లో రుక్మిణి వసంత్?

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.. ఈ సినిమాతో పాటు ఈమె మణిరత్నం డైరెక్షన్లో మరో సినిమా కూడా చేయబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు . ఇలా వరుసగా సౌత్ సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు బాలీవుడ్ అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. రుక్మిణి వసంత్ తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఈమెకు చిన్నప్పటి నుంచి హిందీ భాష పై మంచి పట్టు ఉందని, అందుకే బాలీవుడ్ అవకాశాల కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. త్వరలోనే ఈమె బాలీవుడ్ సినిమాకు సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×