E-Paper
Advertisement

RGV: నేను బాలకృష్ణ సినిమాలు ఇప్పటివరకు చూడలేదు.. ఫ్యాన్స్ ఏకిపారేస్తారేమో చూసుకో వర్మ

RGV: నేను బాలకృష్ణ సినిమాలు ఇప్పటివరకు చూడలేదు.. ఫ్యాన్స్ ఏకిపారేస్తారేమో చూసుకో వర్మ
Advertisement

RGV:నందమూరి బాలకృష్ణ ఇది పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్.  ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అని చెప్పకపోతే వారికి మనసు సంతృప్తిగా ఉండదు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా బాలయ్య పేరు వినిపిస్తుంది అంటే అది కేవలం అభిమానులు వలన మాత్రమే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు బాలయ్య సినిమా చూడనివారు ఉండరు అని చెప్పడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ, వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ మాత్రం ఇప్పటివరకు బాలయ్య సినిమాను చూడలేదు అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్  గోపాల్ వర్మ..  బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణ గారి గురించి చెప్పండి అన్న యాంకర్ ప్రశ్నకు వర్మ మాట్లాడుతూ..” నేను ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు చూడలేదు. 30 ఏళ్ల క్రితం ఎప్పుడో చూశాను కానీ,ఇప్పుడైతే ఆయన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. ఆయన సినిమాలు చూడడం నా సెన్సిబిలిటీలో లేదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ఇక వర్మపై నందమూరి ఫ్రాన్స్ ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. బాలయ్య సినిమాలు నువ్వు ఎందుకు చూస్తావు.. ఒకప్పుడు బాలయ్యని సినిమా కోసం అడిగితే ఆయనే నిన్ను పొమ్మన్నాడు అంట కదా.. అందుకే అప్పటినుంచి సినిమాలు చూడట్లేదు అని ఒకరు కామెంట్ చేస్తే..  ఇంకొందరు ఎవరిష్టం వారిది దానికి ఎందుకు అంత సీరియస్ అని యాంకర్ పై మండిపడుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం చాలాసార్లు బాలయ్య గురించి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడిన వర్మ ఇప్పుడు ఇలా మాట్లాడడం కొత్తగా ఉందని, మెగా ఫ్యామిలీకి దగ్గర అవడం కోసం వర్మ ఇవన్నీ చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు.

గతంలో ఎన్నోసార్లు వర్మ నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. కానీ, ఇప్పుడు మాత్రం మెగా ఫ్యామిలీని ప్రశంసించడంతో ఇది మెగా – నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టినట్లు అయ్యింది. చాలామంది నేను కూడా బాలయ్య సినిమాలు చూడలేదు.. అదేంటో క్రింజ్ లా అనిపిస్తాయి ఆ సినిమాలు అంటూ చెప్పుకొచ్చారు. మరి వర్మలో ఇంత సడెన్ మార్పుకు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×