E-Paper
Advertisement

Dhurandhar Movie: సర్‌ప్రైజ్.. ధురంధర్‌ తెలుగు రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. రెండు వారాలకే ఓటీటీకి కూడా!

Dhurandhar Movie: సర్‌ప్రైజ్.. ధురంధర్‌ తెలుగు రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. రెండు వారాలకే ఓటీటీకి కూడా!
Advertisement

Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ధురంధర్‌ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోతోనే ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కేవలం హిందీ భాషలో విడుదలైన ధురంధర్‌ దక్షిణాదిలోనూ సత్తా చాటుతుంది. డిసెంబ‌ర్ 5న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డ్ కలెక్ష‌న్స్ సాధిస్తూ దూసుకెళుతుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్‌ ఖన్నా ప్రతి కథానాయకుడిగా మెప్పించాడు.

వెయ్యి కోట్ల క్లబ్ లోకి

Advertisement

ఇక సినిమాతోనే ఆయన రీఎంట్రీ ఇవ్వడం విశేషం. సంజయ్‌ దత్‌, మాధవన్‌ వంటి స్టార్స్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. యూరి డైరెక్టర్‌ అదిత్యథర్‌ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం హిందీ భాషలోనే విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ వస్తుండటంతో ధురంధర్‌ని తెలుగుతో పాటు ఇతర సౌత్‌ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధురంధర్‌ తెలుగు రిలీజ్‌ మరింత ఆసక్తి నెలకొంది. అయితే డిసెంబర్‌ 19న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ విడుదల ఉంటుందన్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల మూవీని తెలుగులో రిలీజ్‌ చేయలేకపోయారు. దీంతో ఇక ధురంధర్‌ తెలుగు రిలీజ్ లేదంటూ సోషల్‌ మీడియా తెగ ప్రచారం చేశారు.

డిసెంబర్ 25న తెలుగు రిలీజ్

దీంతో తెలుగు ఆడియన్స్‌ అంత ఈ వార్త విని డిసప్పాయింట్‌ అయ్యారు. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కోసం మూవీ టీం ఆడియన్స్‌ రిక్వెస్టులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్‌ ఫిక్స్‌ అయ్యారు. క్రిస్మస్‌ కానుకగా మూవీ తెలుగు వెర్షన్‌ రిలీజ్ కి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 25న ధురంధర్‌ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజైన రెండు వారాలకు తెలుగు వెర్షన్‌ ఓటీటీకి వస్తుండటం విశేషం. ధురంధర్‌ మూవీ ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ డిజిటల్‌ సంస్థ అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ మేకర్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుందని టాక్‌. కళ్లు చెదిరే డీల్‌తో ధురంధర్‌ రైట్స్‌ని అమెజాన్‌ పొందినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

రెండు వారాల్లోనే ఓటీటీకి

Advertisement

ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి సందర్భంగా స్ట్రీమింగ్‌కి ఇవ్వనుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని టాక్‌. తెలుగు థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం రెండు వారాలల్లోనే ధురంధర్‌ ఓటీటీకి రావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు థియేటట్రికల్‌, ఓటీటీ రిలీజ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే అప్పుడే ధురందర్పార్ట్‌ 2 రిలీజ్కి అంత సిద్దం చేస్తున్నారు. ధురంధర్‌ 2ని వరల్డ్వైడ్గా ఒకేసారి పాన్ఇండియా భాషల్లో రిలీజ్చేసేందుకు మేకర్స్ప్లాన్చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్ఇతర భాషల్లో వచ్చే ఏడాది మార్చి 19 మూవీ రిలీజ్ కానుందని టాక్‌. పార్ట్‌ 2లో ఇమ్రాన్హష్మి విలన్నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×