E-Paper
Advertisement

Peddi Movie: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్… తృట్టిలో తప్పించుకున్న పెద్ది టీం..

Peddi Movie: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్… తృట్టిలో తప్పించుకున్న పెద్ది టీం..
Advertisement

Peddi Movie: ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట(Red Fort) సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్(Bomb Blast) ఘటనతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో భాగంగా సుమారు 20 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ జరగడంతో దేశంలో కొన్ని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఈ బాంబ్ బ్లాస్ట్ లో భాగంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది .ఈ బాంబ్ బ్లాస్ట్ ఘటన నుంచి రామ్ చరణ్ (Ramcharan)పెద్ది సినిమా(Peddi Movie) చిత్ర బృందం తప్పించుకున్నారని తెలుస్తోంది.

ఎర్రకోట సమీపంలో పెద్ది షూటింగ్..

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పెద్ది సినిమా షూటింగ్ పనులలో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో షూటింగ్ నిర్వహించాలని అందుకు అనుమతులు కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఈనెల 15,16 తేదీలలో ఎర్రకోట సమీపంలో షూటింగ్ చేయడం కోసం చిత్ర బృందం అనుమతి కూడా తీసుకున్నారట. ఇలా షూటింగుకు నాలుగు రోజుల ముందే బాంబు బ్లాస్ట్ జరగడంతో చిత్ర బృందం ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని తెలుస్తోంది. ఈ విధంగా ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో పెద్ది సినిమా షూటింగ్ వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ దర్యాప్తులో కీలక విషయాలు తేలే వరకు ఈ పరిసర ప్రాంతాలలో షూటింగ్స్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

బాంబ్ బ్లాస్ట్ నుంచి బయటపడిన పెద్ది టీం..

Advertisement

తాజాగా పెద్ద సినిమా ఈ బాంబు బ్లాస్ట్ ఘటన నుంచి బయటపడ్డారనే విషయం తెలిసిన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇప్పటికే 60% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమాని 2026 మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.

క్రికెట్ కామెంటేటర్ గా జాన్వీ…

Advertisement

ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఈ పాటకు ఎంతో అద్భుతమైన ఆదరణం లభించింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. ఇక త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఈ పాటను డిసెంబర్ 31వ తేదీ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడంతో జాన్వి కపూర్ క్రికెట్ కామెంటేటర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×