E-Paper
Advertisement

Andhra King Taluka : రిలీజ్ డేట్ లో మార్పు, ఈ టైంలో నిర్ణయం ఎందుకో?

Andhra King Taluka : రిలీజ్ డేట్ లో మార్పు, ఈ టైంలో నిర్ణయం ఎందుకో?
Advertisement

Andhra King Taluka : ఈరోజుల్లో చెప్పిన టైం సినిమాలు విడుదలవడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో మార్పులు జరగటం అనేది సహజంగా ఎప్పటినుంచో వస్తుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రమే చెప్పిన డేట్ కంటే కొన్ని సందర్భాల్లో ముందే వచ్చేస్తాయి. అవి కేవలం చిన్న సినిమాలు సంబంధించి జరుగుతుంది.

పెద్ద సినిమాలకు సంబంధించి ఇంకొన్ని రోజులు టైం దొరికితే చాలు ఇంకా బాగా చేసే వాళ్ళం అని దర్శకులు చెబుతూ ఉంటారు. ఇంకా టైం అడిగితే నిర్మాత ఒప్పుకోరు అని అప్పటికప్పుడే రియలైజ్ అవుతారు. ఈ తరుణంలో మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుక సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తుంది.

రిలీజ్ డేట్ లో మార్పు 

Advertisement

రామ్ పోతినేని సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా రోజులైంది. రామ్ ఒక సూపర్ హిట్ సినిమా చేస్తే చూడాలి అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ లో విపరీతమైన టాలెంట్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తను చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. రామ్ కు ఎనర్జిటిక్ హీరో అని ఒక బిరుదు కూడా ఉంది.

రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 28న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ సినిమాను నవంబర్ 28ను కాకుండా ఒకరోజు ముందుగానే నవంబర్ 27ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

అభిమాని బయోపిక్ 

Advertisement

చాలామంది హీరోలకి అభిమానులు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ అభిమానుల కథను చెప్పాలి అని ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా పూర్తిస్థాయిలో అనుకోలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమాలో అభిమానులు అంటే ఎలా ఉంటారు అని కొంత మేరకు చూపించాడు పూరి.

కానీ కంప్లీట్ గా అభిమానుల్ని సబ్జెక్టుగా తీసుకొని ఇప్పటివరకు సినిమా రాలేదు. అదే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహేష్ బాబు. ఆంధ్ర కింగ్ తాలుక సినిమాలో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా రాం పోతినేని కనిపిస్తాడు అని సమాచారం తెలిసిన విషయమే. ఈ సినిమాలో అభిమానికి మరియు హీరోకి మధ్య ఉండే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నవంబర్ 18న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగానే అనౌన్స్ చేశారు.

Also Read: Premisthunnaa: మేనేజర్ పై చేయి చేసుకున్న హీరోయిన్ తండ్రి , కారణం వింటే షాక్ అవ్వాల్సిందే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×