E-Paper
Advertisement

Thalaivar173 : రంగంలోకి దిగిన రజిని అల్లుడు, ఇది అసలైన కాంబినేషన్

Thalaivar173 : రంగంలోకి దిగిన రజిని అల్లుడు, ఇది అసలైన కాంబినేషన్
Advertisement

Thalaivar173 : విలన్ గా కెరియర్ మొదలుపెట్టి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోగా పేరు సాధించుకున్నారు రజినీకాంత్. రజినీకాంత్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని స్టైల్, స్వాగ్ ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఇకపోతే ఇప్పటికే రజనీకాంత్ మొత్తం 172 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు 173 వా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

రజనీకాంత్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో సినిమా వస్తుంది అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారికి ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. కొన్ని కారణాల వలన ఈ సినిమాను సుందర్ చేయడం లేదు అని వార్తలు వినిపించాయి. అదే తరుణంలో సుందర్ కూడా అధికారకంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

రంగంలోకి దిగిన అల్లుడు 

Advertisement

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ లో ధనుష్ ఒకరు. బాక్సాఫీస్ వద్ద ధనుష్ చేసిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో తనకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు సాధించుకున్నాడు.

రజనీకాంత్ చేస్తున్న 173 వా సినిమాకి ధనుష్ దర్శకత్వం వహించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుంది అని కోలీవుడ్ మీడియా చెబుతుంది. దర్శకుడుగా ధనుష్ మంచి సక్సెస్ ఉంది. ఇప్పుడు రజనీకాంత్ తో ధనుష్ సినిమా చేస్తే అది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పాలి.

సుందర్ తప్పుకోవడానికి కారణం 

Advertisement

దర్శకుడుగా సుందర్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. అయితే రజనీకాంత్ సినిమాకి సంబంధించి ఒక హర్రర్ స్టోరీ ను చెప్పారట. లైన్ గా చెప్పినప్పుడు ఆ కథ రజనీకాంత్ కు విపరీతంగా నచ్చింది. దానిని డెవలప్ చేయమని సుందర్ కి పని అప్పచెప్పారు రజిని.

అయితే ఫుల్ స్క్రిప్ట్ విన్న తర్వాత రజిని అసంతృప్తికి గురైనట్లు సమాచారం వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి సుందర్ తప్పుకున్నాడు అని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఈ ప్రాజెక్టుకి కార్తీక్ సుబ్బరాజ్ కూడా దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి ఇప్పుడు తాజాగా ధనుష్ పేరు వినిపిస్తుంది ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది.

Also Read: Andhra King Taluka : రిలీజ్ డేట్ లో మార్పు, ఈ టైంలో నిర్ణయం ఎందుకో?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×