// // Andhra King Taluka - అభిమానులు లేని అభిమాని సినిమా -->
E-Paper
Advertisement

Andhra King Taluka: ఆంధ్ర కింగ్‌ తాలుకా.. అభిమానులు లేని అభిమాని సినిమా

Andhra King Taluka: ఆంధ్ర కింగ్‌ తాలుకా.. అభిమానులు లేని అభిమాని సినిమా
Advertisement

Andhra King Taluka Public Talk: ఎనర్జీటిక్‌ హీరో రామ్‌ పోతినేని.. సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. ఆయన సినిమాల బజ్‌ కేవలం అనౌన్స్‌మెంట్‌కే పరిమితం అవుతుంది. ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆ రేంజ్‌ సినిమాలో పడలేదు. దీనికి సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ చేశారు. అదే డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీతో చేశాడు. రామ్‌ ఎనర్జీ.. పూరీ.. మాస్‌ ఎలివేషన్‌ సీక్వెల్‌కి వర్కౌట్‌ కాలేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా నిలిచింది. బోయపాటితో స్కంద చేశాడు. రిలీజ్ కు ముందు ఈ సినిమా ఆడియన్స్‌ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార పోస్టర్స్, ప్రమోషన్స్‌ విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేశాయి.

రామ్‌ కలిసిరాని మాస్‌ మ్యానరిజం

Advertisement

అలా ఎన్నో అంచనాలతో వచ్చిన స్కందకు ఆడియన్స్‌ని నిరాశ పరిచింది. కథలో కొత్తదనం లేకపోవడం, కథమించిన ఎలివేషన్‌ ఇవ్వడంతో ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యారు. ఇక ఇది రామ్‌ ఖాతాలో ఒక డిజాస్టర్‌గా మిగిలింది. మాస్‌, యాక్షన్‌ వర్కౌట్‌ కావడం లేదంటూ ఈసారి అభిమాని సినిమా అంటూ ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా‘ అంటూ వచ్చాడు. ముందు నుంచి ఈ సినిమాకు ఎలాంటి టాక్‌, బజ్‌ లేదు. కేవలం మూవీ టీం మాత్రం హాడావుడి చేస్తూ కనిపించింది. కానీ, సినిమా కనీస టాక్‌ లేదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర కింగ్‌ తాలుకా వంటి ఒక సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కూడా ఆడియన్స్‌కి పెద్దగా ఐడియా లేకపోవచ్చనే సందేహం వస్తుంది ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటే. రామ్‌ పోతినేని హీరోగా యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్లుగా ఆంధ్ర కింగ్‌ తాలుకా. బయోపిక్‌ ఆఫ్‌ ఫ్యాన్‌ అనే ట్యాగ్‌ లైన్‌.

వర్కౌట్‌ కానీ ఉపేంద్ర ఇమేజ్‌

మహేష్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కన్నడ రియల్‌ స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఓ అభిమాని బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు మహేష్‌ బాబు. నిజానికి ఈ చిత్రానికి ముందు నుంచి ఎలాంటి బజ్‌ లేదు. కానీ, మేకర్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ప్రమోషన్స్‌ చేశారు. ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర ఇమేజ్‌ని కూడా వాడేశారు. కానీ, అది పెద్దగా వర్కౌట్‌ కాలేదని అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా రేపు నవం బర్‌ 28న విడుదల కావాలి. కానీ, చిరవిలో మేకర్స్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ మార్చి ఒక్క రోజు ముందే విడుదల చేశారు. నేడు నవంబర్‌ 27న ఆంధ్ర కింగ్‌ తాలుకా థియేటర్లలోకి వచ్చింది. ఎలాంటి సినిమా అయినా ఓ పెనింగ్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి.

Advertisement

Also Read: Sofik Sk’s Viral MMS: సోషల్‌ మీడియా స్టార్‌ సోఫిక్‌ ప్రైవేట్‌ వీడియో లీక్.. అసలు నిజం చెప్పిన ప్రియురాలు

ఫ్యాన్స్‌ కూడా లేని అభిమాని మూవీ

అలాంటి రామ్‌ పోతినేని లాంటి ఎనర్జిటిక్‌ మ్యానరిజం ఉన్న హీరో సినిమా ఓపెనింగ్స్‌ అంటే ఎలా ఉండాలి. కానీ, ఆంధ్ర కింగ్‌ తాలుకా కనీసం చిన్న సినిమా రేంజ్‌ ఓపెనింగ్స్‌ కూడా తేచ్చేలా లేద. రామ్‌ అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపించడం లేదట. థియేటర్లలో ఆక్యూపెన్సీ అలా ఉంది. ఐమ్యాక్స్‌ లాంటి పెద్ద థియేటరల్లో కూడా ఫస్ట్‌ షోకి కనీస ఆక్యూపెన్సీ కూడా లేదు. ఫస్ట్‌ షోకికి కేవలం 35 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. బుక్‌ మై షోలో ఈ సినిమా థియేటర్లన్ని గ్రీన్‌లో ఉన్నాయి. టికెట్స్‌ కూడా పెద్దగా సేల్‌ అవ్వడం లేదు. ఇక అడ్వాన్స్‌ బుక్కింగ్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయట. దీంతో థీయేటర్లలో ఆంధ్ర కింగ్‌ తాలుకా పరిస్థితి చూసి.. అభిమాని సినిమాకు అభిమానులే కరువయ్యారని మాట్లాడుకుంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×