E-Paper
Advertisement

Home Remedies for Knee Pain: శీతాకాలంలో వేధించే తీవ్రమైన మోకాలి నొప్పులకు చెక్ పెట్టేదెలా?

Home Remedies for Knee Pain: శీతాకాలంలో వేధించే తీవ్రమైన మోకాలి నొప్పులకు చెక్ పెట్టేదెలా?
Advertisement

Home Remedies for Knee Pain: శీతాకాలం వచ్చిదంటే చాలు.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా మన వెంటపడుతుంటాయి. మఖ్యంగా వయసు పైబడిన వాళ్లను ఈ సీజన్లో మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. వణికించే చలిలో కండరాలు, కీళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. చలి కారణంగా చాలామంది పాదాలలో వాపు కూడా ఏర్పడుతుంటుంది. దీంతో నడవటమూ కష్టంగా మారుతుంటుంది. అయితే, చలికాలంలో కీళ్లు లేదా మోకాళ్ల నొప్పులతో బాధపడుతన్న వాళ్లు కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే నొప్పి, వాపు నుండి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు నిపుణులు.

గోరువెచ్చని నూనెతో మసాజ్:

అసలే చలికాలం.. దీనికి తోడు రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతలు. దీనివల్ల కండరాలు, కీళ్లపైన ఒత్తిడి పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ రాత్రి పడుకునే ముందు.. గోరువెచ్చని నువ్వులు లేదా కొబ్బరి నూనెతో 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వెచ్చని ఆయిల్ చర్మం, కణజాలాల్లోకి లోతుగా చొచ్చుకెళ్తుంది. దీనివల్ల రక్త ప్రవాహం పెరిగి, మంట సైతం తగ్గడంతో మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

Read Also: చిన్నా పెద్దా అందరూ తినొచ్చు.. పచ్చి బఠానీలు పలు వ్యాధులకు తిరుగులేని దివ్యౌషధం!

పసుపు కలిపిన పాలు:

పసుపులో సహజంగా లభించే కుర్కుమిన్ అనే సమ్మేళనం వాపు, నొప్పిని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ప్రతిరోజూ రాత్రి గోరువెచ్చని పాలలో టీస్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టవచ్చు. ఈ పసుపు కలిపిన పాలు నొప్పులను తట్టుకునేలా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

హాట్ వాటర్ కంప్రెస్‌:

Advertisement

ఎంత తీవ్రమైన మోకాళ్ల నొప్పి ఉన్నా.. హాట్ వాటర్ కంప్రెస్ పద్ధతిని పాటించడం ద్వారా తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. నీటి వెచ్చదనం నరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. అలాగే, కీళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు హాట్ వాటర్ కంప్రెస్ ట్రీట్‌మెంట్ చేసుకోవాలి.

ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు:

ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో మెంతులు నానమెట్టిన నీళ్లను తాగితే మోకాళ్ల నొప్పులకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మెంతి కీళ్లకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు నిపుణులు. మెంతుల్లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మోకాలి నొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. దీనికోసం ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో నమలాలి లేదా మెంతి పేస్ట్ తయారు చేసి నొప్పి ఉన్న ప్రాంతానికి అప్లై చేయాలి.

అల్లం ఆవిరి భేష్:

మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో అల్లం కీలకపాత్ర పోషిస్తుంది. అల్లం జింజెరాల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. జలుబు వల్ల కలిగే మోకాళ్ల నొప్పికి ఈ సమ్మేళనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం టీ తాగడం లేదా వేడి నీటిలో అల్లంతో ఆవిరి పట్టడం వల్ల మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.

Read Also: భరించలేని తలనొప్పి క్షణాల్లో మాయం.. ఐస్ వాటర్‌లో దాగున్న అద్భుత రహస్యమిదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×