E-Paper
Advertisement

RC 17: మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా..

RC 17: మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా..
Advertisement

RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫ్రెండ్ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవి ఏప్రిల్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు.. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. గత కొద్ది రోజులుగా సుకుమార్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుందంటూ సమాచారం.. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సుకుమార్ మెగా ఫాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అసలు సుకుమార్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో ఒకసారి చూసేద్దాం…

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

పెద్ది సినిమా షూటింగులో బిజీగా ఉంటూనే చరణ్ మరోవైపు తన తర్వాతి సినిమాపై ఫోకస్ చేశారు. పెద్ది తర్వాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం సినిమా వచ్చింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో మూవీ రావడంతో మెగా ఫాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి బజ్ ఉంది.. అయితే పుష్ప 2 లాగే రామ్ చరణ్ కోసం రెండు పార్ట్ లకు కథ సిద్ధం చేసినట్లు గతంలో వార్తలు వినిపించాయి. రెగ్యులర్ స్టైల్ కు తగ్గట్టు ఓ క్లాస్ కథతో పాటూ, రంగస్థలం లాంటి ఓ మాస్ కథను కూడా రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది.. ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటంటే..

Advertisement

Also Read : మనోజ్ కు మరో టెన్షన్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. తల్లి కోసం రోహిణి షాకింగ్ నిర్ణయం..?

రెండు మాస్ స్టోరీలతో రామ్ చరణ్.. 

గతంలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరికలయికలో మరో మూవీ ఫిక్స్ అయ్యింది. అయితే దీన్ని రెండు పార్ట్ లుగా తీసేందుకు సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.. అయితే ఈ రెండు సినిమాలు మాస్ యాక్షన్ స్టోరీలతో రాబోతున్నడంతో మెగా ఫాన్స్ సినిమాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకేసారి రామ్ చరణ్ తో సుకుమార్ రెండు సినిమాలు తీయడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఈ వార్త కనుక నిజమైతే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. సుకుమార్ కథతో పాటూ చరణ్ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఈ ఇయర్ సమ్మర్ నుంచి సినిమాను మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లోగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ తో ఒక సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప 3 తెరకెక్కించే పనిలో సుకుమార్ ఉండబోతున్నట్లు సమాచారం..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×