E-Paper
Advertisement

Raju Weds Rambai : ఆ నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు, ఎమోషనల్ అయిపోయిన డైరెక్టర్

Raju Weds Rambai : ఆ నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు, ఎమోషనల్ అయిపోయిన డైరెక్టర్
Advertisement

Raju Weds Rambai Director Sailu: మనం తినే మెతుకు మీద మన పేరు రాసి ఉంది అన్నట్లు, ఎవరికీ ఏ సినిమా రాసిపెట్టి ఉంటుందో వాళ్లు మాత్రమే చేయగలుగుతారు. రీసెంట్ టైమ్స్ లో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమా కంటెంట్ సరిగ్గా ఉంటే ప్రేక్షకులు దానిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు అనడానికి బోలెడు సినిమాలు ఉదాహరణలు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపించాయి. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ఈ సినిమాతో సాయిలు కంపాటి దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఆ నలుగురు రిజెక్ట్ చేశారు

Advertisement

చాలామంది ఈ దర్శకుడిని తక్కువ అంచనా వేశారు. లైఫ్ లో ఎన్నో రిజెక్షన్స్ చూశాడు అని ఇతని జర్నీ చూస్తే అర్థమయిపోతుంది. ముఖ్యంగా అతను రాజు వెడ్స్ రాంబాయి కథను చాలామంది హీరోలకు చెప్పినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమాను రాసినప్పుడు 2016 ఆ టైంలో రాహుల్ రామకృష్ణకు చెబుదామని అనుకున్నారట. అయితే ఆ టైంలో రాహుల్ రామకృష్ణ కూడా చాలా లేతగా కనిపించేవాడు. అయితే సినాప్సిస్ అవేవీ తెలియకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో సినాప్సిస్ రెడీ చేసి రాహుల్ రామకృష్ణకు పంపించారు. కానీ ఎటువంటి రిప్లై రాలేదు.

సుమంత్‌ ప్రభాస్కూడా

కొన్ని రోజుల తర్వాత అదే కథను హీరో సుమంత్ ప్రభాస్ కు చెప్పాడు సాయిలు. ఆ కథ సుమంత్ ప్రభాస్ కు విపరీతంగా నచ్చింది. చేద్దామని కూడా అన్నాడు. కానీ కొన్ని కారణాల వలన సుమంత్ ప్రభాస్ ఆ సినిమాను చేయలేదు. పెద్దకాపు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు విరాట్ కర్ణ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఆ హీరోకి కూడా ఈ కథను చెప్పాడు సాయిలు. అతనికి ఈ కథ ఎక్కలేదు. సుమా కనకల కొడుకు రోషన్ కనకాల కూడా ఈ కథను విన్నారు. ఆయనకు కూడా పూర్తిస్థాయిలో కథ ఎక్కకపోవటం వల్ల రిజెక్ట్ చేశారు. మొత్తానికి చాలా రిజెక్షన్ తర్వాత రాజు వెడ్స్ రాంబాయి సినిమా అలా బయటకు వచ్చింది.

Advertisement

Also Read: IBomma Ravi Case: తప్పు చేశా, ఇక పైరసీ చేయను.. పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి పశ్చాత్తాపం

వాళ్లు ఎలా ఫీల్ అవుతారో?

కొన్ని సినిమాలు చెప్పినప్పుడు అంత ఆసక్తికరంగా అనిపించవు కానీ స్క్రీన్ మీద ఆ సినిమాలను చూస్తే ఇంత బాగా ఎలా తీశాడు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అందుకే చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చేయాల్సింది అనవసరంగా వదులుకున్నాను అని ఫీల్ అవుతూ కూడా ఉంటారు. పైన ఉదహరించిన నలుగురు హీరోలు ఈ సినిమా విషయంలో ఎలా ఫీలవుతారో తెలియదు కానీ ఒక మంచి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి కేవలం ప్రతి ప్రశంసలు మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. చాలా తక్కువ సందర్భాల్లో ఈ రెండు కలిసి వస్తుంటాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×