// // Laughing Yoga Benefits: లాఫింగ్ యోగాతో ప్రయోజనాలు అనేకం! -->
E-Paper
Advertisement

Laughing Yoga Benefits: నవ్వు నలభై విధాలా గ్రేటు.. లాఫింగ్ యోగా వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ సొంతం!

Laughing Yoga Benefits: నవ్వు నలభై విధాలా గ్రేటు.. లాఫింగ్ యోగా వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ సొంతం!
Advertisement

Laughing Yoga Benefits: మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు జీవితంలో ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ముందుకెళ్లాలని. మనసారా నన్వితే ఆరోగ్యానికే కాదు.. మన అందాన్ని రెట్టింపు చేయడం లోనూ ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్లకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు రావని చెబుతుంటారు నిపుణులు. రోజులో కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు నవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే సమయం దొరికినప్పుడల్లా కాసేపు మనసారా నవ్వడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా దూరం చేయవచ్చు. ముఖ్యంగా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి మనసారా నవ్వడమే మానేశాడు. అలాంటి వాళ్లు తప్పక చేయాల్సిన వ్యాయామమే ఈ లాఫింగ్ యోగా. దీని గురించి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..

 నవ్వండి.. నవ్వించండి:

ఈ లాఫింగ్ యోగాలో ఎలాంటి జోకులు, కామెడీ, సంతోషకరమైన వాతావరణం వంటివి ఉండవు. కేవలం శారీరక కదలికల ద్వారా నవ్వడమే హాస్య యోగా. ఇది చేస్తే.. ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మెదడుకు ప్రాణవాయువు సరఫరా మెరుగవుతుంది. మన శరీరం లోపలి అవయవాలు కూడా చురుగ్గా పని చేస్తాయి. కాబట్టి.. రోజులో కనీసం 10 నుంచి 20 నిమిషాల పాలు పగలబడి నవ్వండి.

Advertisement

Read Also: యోగముద్రాసన.. ఒత్తిడి పారిపోవాల్సిందే!

ఎలా నవ్వినా నవ్వే:

ఈ హాస్య యోగా మానసిక ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. సహజంగా లేదా కృత్రిమంగా, ఏ విధంగా నవ్వినా మన మెదడు ఆ తేడాను పసిగట్టదట. ఎలా నవ్వినా మన మెదడు నుంచి ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ ఎండార్ఫిన్లు ఆనందాన్నీ, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ముంబైకి చెందిన డాక్టర్ మదన్ కటారియా 1995లో చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ హాస్య యోగా ప్రక్రియను రూపొందించాడు.

మానసిక ఉల్లాసం సొంతం:

Advertisement

ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో లాఫింగ్ క్లబ్బులు వెలశాయి. ఇక హైదరాబాద్​‌లో కూడా ఈ లాఫింగ్ క్లబ్బులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. లాఫింగ్ క్లబ్స్, యోగా శిక్షకులు హాస్య యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. మొదట నవ్వుకోవడానికే పరిమితమైన ఈ లాఫింగ్ క్లబ్స్ ప్రస్తుతం ఎంతో మార్పు చెందాయి. ఇక్కడ జోక్స్ వేసి నవ్వించడం ఉండదు. యోగా బ్రీతింగ్‌తో పాటు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేయడం దీని ప్రత్యేకత. రోజులో కనీసం 15- 20 నిమిషాల పాటు హాస్య యోగా చేస్తే అనారోగ్యం దూరమవడమే కాకుండా మానసిక ఉల్లాసమూ సొంతమవుతుంది.

నవ్వుతో అందం రెట్టింపు:

రోజులో కాసేపు మనసారా నవ్వుకుంటే.. మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది. ఈ లాఫింగ్ యోగా వలన ముఖంపై ఏర్పడిన మచ్చలు, ముడతలు కనిపించకుండా పోతాయి. అలాగే  వాకింగ్, జాగింగ్‌కు వెళ్లేవాళ్లు ఆ సమయంలోనే 10 నుంచి 15 నిమిషాలు నవ్వడానికి కేటాయిస్తే సరిపోతుంది. ఇక ఉద్యోగాలు చేస్తూ.. మానసికంగా, శారీరకంగా బాగా ఒత్తిడికి లోనవుతున్నవాళ్లు రోజులో ఓ పావుగంట ఈ హాస్య యోగాను చేయండి. దీంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. లాఫింగ్ యోగాకు దీనికి ఎలాంటి వయసు పరిమితి లేదు. చిన్నపిల్లల దగ్గరి నుంచి వయుసు పైబడిన వాళ్లందరూ దీనిలో పాల్గొనవచ్చు.

Read Also: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×