E-Paper
Advertisement

ఏంటీ.. ‘రాకాస’ డైరెక్టర్ మానస, ఇన్ని వెబ్ సీరిస్‌లు.. సినిమాలు చేసిందా?

ఏంటీ.. ‘రాకాస’ డైరెక్టర్ మానస, ఇన్ని వెబ్ సీరిస్‌లు.. సినిమాలు చేసిందా?
Advertisement

Manasa Sharmaటాలీవుడ్‌లో ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్ పేరు గట్టిగా వినిపిస్తోంది.. ఆమే మానస శర్మ.. నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’ మూవీతో వెండితెరకు పరిచయమవుతున్న ఈ శ్రీకాకుళం అమ్మాయి, అచ్చం హీరోయిన్‌లా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఈమె కేవలం అందగత్తె మాత్రమే కాదు, అంతకు మించి అద్భుతమైన టాలెంట్ ఉన్న రైటర్, డైరెక్టర్ కూడా. ఇప్పటికే పలు హిట్ వెబ్ సిరీస్‌లతో తన సత్తా చాటిన మానస, ఇప్పుడు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాబోతోంది. అసలు ఈమె సక్సెస్ జర్నీ ఏంటో ఒకసారి చూద్దాం.

మ్యాడ్ హౌస్ నుంచి బెంచ్ లైఫ్ వరకు..:

మానస శర్మ ప్రయాణం యూట్యూబ్ నుంచి మొదలైంది. 2019లో నిహారిక ప్రొడక్షన్ కంపెనీలో ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ సిరీస్‌కు రైటర్‌గా పనిచేసింది. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్‌గా, రచయితగా మారి తనలోని క్రియేటివిటీని నిరూపించుకుంది. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌తో డైరెక్టర్‌గా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వరుస విజయాలు సాధిస్తూ, వెబ్ సిరీస్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మానస.. ఇప్పుడు ‘రాకాస’తో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ను కాదనుకొని..:

Advertisement

నిజానికి ‘రాకాస’ కథను మొదట వెబ్ సిరీస్‌గానే తీయాలని అనుకున్నారట. దీనికోసం నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజ సంస్థ నుంచి ఆఫర్ కూడా వచ్చిందట. కానీ ఎప్పుడైతే హీరో సంగీత్ శోభన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారో, అప్పుడు మానస తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇక సంగీత్ కామెడీ టైమింగ్‌ను ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లోనే అద్భుతంగా వాడుకున్న మానస, ఈ కథను వెబ్ సిరీస్ కంటే డైరెక్ట్ మూవీగా తీస్తేనే బాగుంటుందని ఫిక్స్ అయింది. అలా ఒక అందమైన ‘చందమామ కథ’ లాంటి ఫాంటసీ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

అచ్చం హీరోయిన్‌లా ఉందే:

సినిమా ప్రమోషన్లలో మానస శర్మ మాట్లాడుతుంటే.. ఈమె డైరెక్టరా లేక హీరోయిన్నా అనే సందేహం కలగక మానదు. ఆమె చురుకైన మాటతీరు, అమాయకత్వం, అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం ‘ఓయ్’ సినిమా హీరోయిన్ షామిలీలా కనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కేవలం డైరెక్షనే కాదు, హీరోయిన్‌గా కూడా ట్రై చేయవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. అయితే మానస మాత్రం తన ఫోకస్ అంతా క్రియేటివ్ రైటింగ్ మరియు డైరెక్షన్ మీదే ఉందని, మంచి కథలతో ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని చెబుతోంది.

Advertisement

ALSO READ:ధురంధర్ 2 పై కాపీ ఆరోపణలు.. మండిపడుతున్న కన్నడ డైరెక్టర్!

ఏప్రిల్ 3న అసలైన పరీక్ష:

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3, 2026న విడుదల కానుంది. ఇందులో సంగీత్ శోభన్ సరసన హిట్ హీరోయిన్ నయన్ సారిక నటిస్తోంది. వీరితో పాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. వెబ్ సిరీస్‌లతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న మానస, ఇప్పుడు వెండితెరపై కూడా సక్సెస్ కొట్టి స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరుతుందో లేదో చూడాలి. ఇక ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు దొరికిందని చెప్పవచ్చు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×