E-Paper
Advertisement

Gas Saving Tips: గ్యాస్ సిలిండర్ల కొరత.. కుక్కర్‌లో చేసే ఈ వంటలతో.. ఈజీగా బయటపడొచ్చు!

Gas Saving Tips: గ్యాస్ సిలిండర్ల కొరత.. కుక్కర్‌లో చేసే ఈ వంటలతో.. ఈజీగా బయటపడొచ్చు!
Advertisement

Gas Saving Tips: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ లోని ఎల్ పీజీ గ్యాస్ సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. బుక్ చేసిన సిలిండర్ రావడానికి గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు పడుతోందన్న ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని ప్రెసర్ కుక్కర్ లో వండటం ద్వారా కొద్దిమేర గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

గ్యాస్‌ను కుక్కర్ ఎలా ఆదా చేస్తుంది?

ప్రస్తుత గ్యాస్ కొరత పరిస్థితుల్లో ప్రెసర్ కుక్కర్ అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడనుంది. ఇది లోపలి ఆవిరిని బయటకు పంపకుండా అధిక పీడనంతో ఆహారపదార్థాలు త్వరగా ఉడికేలా చేస్తుంది. సాధారణ గిన్నెల కంటే 70% వేగంగా కుక్కర్ లో ఆహారపదార్థాలు, మాంసం, కూరగాయాలు ఉడుకుతాయి. తక్కువ సమయంలోనే వంట పూర్తి చేయడం వల్ల ఎల్ పీజీ గ్యాస్ ను కూడా ఆదా చేసుకోవచ్చు. కుక్కర్ లో ఎంతో రుచిగా ఉండే 5 ప్రత్యేక వంటకాలు ఇప్పుడు చూద్దాం.

దాల్ తడ్కా (Dal Tadka)

Advertisement

గ్యాస్ ఆదాతో పాటు.. కుక్కర్ వేగంగా ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. దాల్ తడ్కా కోసం.. పప్పును ముందే 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత కుక్కర్‌లో తగినంత నీరు, ఉప్పు, పసుపు వేసి 3-4 కూతలు వచ్చేవరకూ ఉడికించాలి. పప్పు మెత్తగా అయ్యాక విడిగా పోపు పెట్టుకుంటే రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది.

అన్నం (Rice)

సాధారణంగా గిన్నెలో అన్నం వండటం అనేది కాస్త శ్రమతో కూడుకున్నపని. అన్నం ఉడికేదాక ఎదురుచూడటం, తర్వాత గంజి వార్చి మళ్లీ కొద్దిసేపు పొయ్యి మీద ఉంచడం వల్ల గ్యాస్ ఖర్చవుతుంది. అదే కుక్కర్ లో అన్నం వండితే ఇవేమి చేయాల్సిన పని ఉండదు. కప్ రైస్ కు ఒకటిన్నర కప్పుల నీరు పోసి 2 విజిల్స్ వచ్చే వరకూ ఉంచితే రైస్ రెడీ అయిపోతుంది.

రాజ్మా (Rajma)

Advertisement

సాధారణంగా రాజ్మా ఉడకడానికి చాలా సమయం తీసుకుంటుంది. వీటిని రాత్రంతా నానబెట్టి, కుక్కర్‌లో కొద్దిగా వంటసోడా వేసి ఉడికిస్తే త్వరగా మెత్తబడతాయి. అనంతరం మీరు కోరుకున్న స్టైల్లో వంటకు కావాల్సిన పదార్థాలు వేసుకొని రుచిగా వండుకోవచ్చు.

పనసకాయ కూర (Kathal ki Sabzi)

పనస ముక్కలను నేరుగా గిన్నెలో వండితే చాలా గ్యాస్ ఖర్చవుతుంది. కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి ఆ తర్వాత మసాలాలతో ఫ్రై చేస్తే త్వరగా వంట పూర్తి అవుతుంది. దీని వల్ల గ్యాస్ ను కొద్దిమేర ఆదా చేసుకోవచ్చు.

సొరకాయ కూర (Lauki ki Sabzi)

సమ్మర్ లో సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో నీటి శాతం ఎక్కువ కాబట్టి.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఇది కాపాడుతుంది. సొరకాయను కుక్కర్ లో వల్ల ముక్కలు త్వరగా ఉడకడమే కాకుండా.. ముక్కల్లోని పోషకాలు ఆవిరి రూపంలో బయటకు పోకుండా ఉంటాయి.

Also Read: Induction Stove: ఇండక్షన్ స్టవ్‌పై నీరు చిందితే.. షాక్ కొడుతుందా? ఈ నిజాలు తెలుసుకోండి!

గ్యాస్ ఆదాకు మరికొన్ని చిట్కాలు

కొందరు వంట చేసేటప్పుడు స్టవ్ మీద గిన్నెను సరిగా మంటతగిలేలా పెట్టరు. దీనివల్ల మంట పక్కలవైపునకు వెళ్లి వృథా అవుతుంది. కాబట్టి గిన్నె పరిమాణాన్ని బట్టి మంటను అడ్జస్ట్ చేయండి. స్టవ్ పై వంట చేసేటప్పుడు చిన్న గిన్నెల కంటే వెడల్పాటివి వాడితే బెటర్. మరోవైపు ఫ్రిజ్ నుంచి తీసిన కూరగాయాలు, పాలను నేరుగా స్టవ్ మీద పెట్టకండి. అవి గది ఉష్ణోగ్రతలోకి వచ్చాకే వంటకు వినియోగిస్తే కొద్దిమేర గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు. వీలైనంత వరకూ చిన్నబర్నర్ ను వంటకు వినియోగిస్తే మంచిది. తద్వారా గ్యాస్ ను సేవ్ చేసుకోవచ్చు. మెుత్తంగా వంటలో ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా 5-10 రోజుల పాటు అదనపు గ్యాస్ ను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Brahmamudi Indu : ‘బ్రహ్మముడి’ ఇందు జీవితంలో కష్టాలు.. ఆస్తుల విలువ ఎంతంటే..?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×