E-Paper
Advertisement

నిర్మాత పివిపి సంచలన వ్యాఖ్యలు!.. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌కు కారణం?..

నిర్మాత పివిపి సంచలన వ్యాఖ్యలు!.. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌కు కారణం?..
Advertisement

Brahmotsavam Disaster: సూపర్‌స్టార్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ (2016) బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా డిజాస్టర్ వెనుక ఉన్న అసలు కారణాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు చిత్ర నిర్మాత, పివిపి సినిమాస్ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి (PVP). సినిమా ఫ్లాప్ అవ్వడానికి దర్శకుడి నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-‘ఆయన్ని ప్రశాంతంగా బతకనివ్వండి’.. ఆ పుకార్లపై ఇళయరాజా తమ్ముడు ఫైర్!

స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వద్దు!

Advertisement

సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే తాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మెయిల్ ద్వారా ఒక స్పష్టమైన హెచ్చరిక చేశానని పీవీపీ తెలిపారు. “స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ కాకుండా షూటింగ్‌కు వెళ్లొద్దని నేను ముందే చెప్పాను. మనం చేసేది సొంత వ్యాపారం కాదు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డబ్బులతో సినిమా చేస్తున్నాం. కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలి, వాళ్ల సొమ్ముకు బాధ్యత వహించాలి అని చాలా క్లియర్‌గా వివరించాను” అని పీవీపీ పేర్కొన్నారు.

కథ మంచిదే.. కానీ

నిజానికి ‘బ్రహ్మోత్సవం’ ఒక మంచి స్క్రిప్ట్ అని, కానీ మేకింగ్ దశలో దర్శకుడి ప్రవర్తన వల్లే అంతా దెబ్బతిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డైరెక్టర్ నిర్లక్ష్యం, సరైన క్రమశిక్షణ లేకపోవడం వల్లే సినిమా అపజయం పాలైందని, దీనివల్ల తాము భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పీవీపీ ఓపెన్‌గా చెప్పారు.

Advertisement

Read also-‘ధురంధర్’ టెక్నీషియన్‌పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే?

వ్యక్తిగతంగా ఒక సినిమా గురించే కాకుండా, చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం’ అని పీవీపీ తేల్చి చెప్పారు. పక్కా ప్లానింగ్, పూర్తి స్థాయి స్క్రిప్ట్ లేకుండా సెట్స్‌పైకి వెళ్లడం వల్ల కోట్లాది రూపాయల బడ్జెట్ వృథా అవ్వడమే కాకుండా, నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. పీవీపీ చేసిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటూ టాలీవుడ్ పరిశ్రమ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×