E-Paper
Advertisement

Bandla Ganesh: నా హృదయం భారంగా మారింది.. బండ్లన్న ఎమోషనల్ పోస్ట్!

Bandla Ganesh: నా హృదయం భారంగా మారింది.. బండ్లన్న ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Bandla Ganesh:ప్రముఖ నటుడిగా, నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh).. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటూ అటు సమాజంలో జరిగే విషయాలపై ఇటు సినీ ఇండస్ట్రీలో జరిగే విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే నిన్న రెండవ నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజీ బ్లాక్ బాస్టర్స్ అంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించాను అంటూ ఈ హౌస్ ద్వారా అన్ని సున్నితమైన కథలను ప్రేక్షకులకు అందిస్తానని చెప్పి అభిమానులను సంబరపరిచిన విషయం తెలిసిందే. అంతలోనే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు బండ్ల గణేష్ . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న బండ్ల గణేష్..

తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు బండ్ల గణేష్. విషయంలోకి వెళ్తే.. ఈరోజుతో 2025 సంవత్సరం ముగియనుంది. రేపటితో 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అనుభవాలను, జ్ఞాపకాలను వర్ణిస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు బండ్ల గణేష్.

హృదయం భారంగా మారుతోంది..

Advertisement

2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారి ద్రవిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే కాదు నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం. నా బ్రతుకుకి కొత్త అర్థాన్ని, కొత్త దారిని చూపించిన మహత్తర సమయం. నేను ఊహించనంత ప్రేమను, అండను, అద్భుతాలను నాకు ప్రసాదించిన సంవత్సరం. ముఖ్యంగా భగవంతుడే స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలోకి అడుగుపెట్టిన సమయం . ఇలాంటి దివ్యమైన రోజులు వెళ్ళిపోతున్నాయి అంటే ఎందుకో చెప్పలేనంత బాధ నాలో కలుగుతోంది.

also read:Meenakshi: మరోసారి సంక్రాంతి టార్గెట్ అంటున్న మీనాక్షి.. డబుల్ ట్రీట్!

సంకల్పాన్ని దృఢం చేసే రోజులు రావాలి..

Advertisement

భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నాను. 2025 సంవత్సరంలాగే ఆశ నింపే రోజులు, విశ్వాసాన్ని బలపరిచే సంఘటనలు, అలాగే నా సంకల్పాన్ని దృఢం చేసే అనుభవాలు రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా నాతో పాటు మనందరికీ కూడా దక్కాలని.. అందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. ఇదే నా హృదయపూర్వక సంకల్పం” అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. మొత్తానికైతే 2025 సంవత్సరంలాగే తనతో పాటు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుతూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

బండ్ల గణేష్ కెరియర్

నటుడిగా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత కమెడియన్ గా , నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఆంజనేయులు, గబ్బర్ సింగ్ , తీన్మార్, గోవిందుడు అందరివాడేలే, నీ జతగా నేనుండాలి , ఇద్దరమ్మాయిలతో, బాద్ షా , టెంపర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై చివరిగా టెంపర్ చిత్రాన్ని నిర్మించిన ఈయన.. ఇప్పుడు బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు . మరి వచ్చే ఏడాది ఈ బ్యానర్లో ఎలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×