E-Paper
Advertisement

రాజకీయాల్లో తిట్లు తినడం కంటే సినిమాలే బెటర్.. రూటు మార్చిన పోసాని కృష్ణమురళి!

రాజకీయాల్లో తిట్లు తినడం కంటే సినిమాలే బెటర్.. రూటు మార్చిన పోసాని కృష్ణమురళి!
Advertisement

Posani Comeback: పోసాని కృష్ణమురళి…అతి తక్కువ కాలంలో వంద సినిమాలకి రచయితగా పని చేసి కొన్ని వందల సినిమాలలో నటుడిగా మెప్పించి, దర్శకత్వం కూడా వహించిన వెర్సటైల్ మల్టీ టాలెంటెడ్.అయితే వైసీపి ప్రభుత్వంలో తనదైన శైలిలో మైకుల ముందు పొలిటికల్ కామెంట్స్ తో తెగ హడావిడి చేసి పర్యావసానాలు చూసిన పోసాని వాటికి ఎండ్ కార్డ్ వేసి మళ్లీ తన సొంత గూటికి చేరిపోయారు.

రూటు మార్చిన పోసాని

Advertisement

ఇన్నాళ్లూ మైకుల ముందుకు వచ్చి పొలిటికల్ కామెంట్లతో హల్‌చల్ చేసిన ఆయన, ఇకపై అసలు రాజకీయాల జోలికే వెళ్లనని స్పష్టంగా ప్రకటించేశారు. దాంతో ఆయన మళ్లీ పాత రోజుల్లా వరుసగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ లేదా అచ్చిచ్చిన రచన వైపో బిజీ అయిపోతారని అంతా భావించారు.

కానీ సంవత్సరానికి ఒక్క సినిమా తీస్తానని చెప్పేసి అందరి అంచనాలను తలకిందులు చేసేశాడు .అవును రూటు మార్చిన పోసాని ఇకపై ప్రతీ ఏడాదీ కచ్చితంగా ఒక్క సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వస్తానని క్లారిటీ ఇచ్చేశారు.

Advertisement

ఏడాదికి ఒక సినిమా చేస్తా.. పోయినా నాకు పర్వాలేదు

మాములుగా సొంతంగా సినిమాలు తీస్తే కోట్లలో నష్టాలు వస్తాయని ఎవరైనా భయపడతారు. కానీ పోసాని మాత్రం చాలా కూల్‌గా “ఏడాదికి ఒక సినిమా చేస్తా.. పోయినా నాకు పర్వాలేదు, పోయేదీ లేదు.. వచ్చేదీ లేదు” అంటూ బాంబు పేల్చారు.

also read :‘వారణాసి’ డీల్ సక్సెస్..ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా టైటిల్ !

అసలు థియేట్రికల్ రన్నే సరిగ్గా లేదు.ఇక ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ డిజిటల్ రైట్స్ కూడా అంతంతమాత్రమే.అలాంటిది నష్టాలు రాకుండా పోసాని ఏ మంత్రం వేసి సినిమాను లాభాల్లోకి తెస్తారో చూడాలి.

చీర గెటప్ పై అప్పుడే సోషల్ మీడియాలో డిబేట్లు

ఈ కొత్త చాప్టర్‌కు శ్రీకారం చుడుతూ పోసాని ఇటీవల ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే సినిమాకి స్వయంగా దర్శకత్వం వహించారు పోసాని . ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించడమే కాకుండా కీలక పాత్రలో నటించారు కూడా,ఇక ఈ సినిమాలో వేసిన చీర గెటప్ పై అప్పుడే సోషల్ మీడియాలో డిబేట్లు స్టార్ అయిపోయాయి కూడా.

గతంలో ‘శ్రావణమాసం’ (2005 మార్చి 4), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007 మే 25), ‘ఆపరేషన్ దుర్యోధన 2’ (2013), వంటి చిత్రాలతో దర్శకుడిగా తన లక్ టెస్ట్ చేసుకున్న పోసాని ఈ సినిమాతో తన పునర్వైభావాన్ని చూస్తాడో లేదో చూడాలి.

ఇప్పటికైనా అర్థమయిందన్న మాట !

బడ్జెట్ కంట్రోల్ చేయడం, తక్కువ మంది టెక్నీషియన్స్ తో పని చేయడం,సొంత స్టైల్‌లో తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడమే ఆయన సక్సెస్ సీక్రెట్ అయి ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.
ఏది ఏమైనా, పొలిటికల్ కాంట్రవర్సీలకు గుడ్ బై చెప్పేసి, ప్రతీ ఏటా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్న పోసాని క్రేజీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.మొత్తానికి పాలిటిక్స్ లో తిట్లు తినడం కన్నా ఇండస్ట్రీలో సినిమాలు తీసుకోవడం ఉత్తమం అని ఇప్పటికైనా అర్థమయిందన్న మాట !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×