E-Paper
Advertisement

New year Special re-releases : కొత్త సంవత్సరంలో పాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు

New year Special re-releases : కొత్త సంవత్సరంలో పాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు
Advertisement

New year Special re-releases : ఒకప్పుడు థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు కంటే కూడా ఇప్పుడు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు సంఖ్య కంప్లీట్ గా తగ్గిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒక సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తే కానీ చాలామంది థియేటర్ కి రాని పరిస్థితి ఏర్పడింది. అయితే చాలామంది కొత్త సినిమాలు అన్నీ కూడా ఓటీటీ లో చూస్తున్నారు పాత సినిమాల కోసం థియేటర్ కి వెళ్తున్నారు అని అంటూ ఉంటారు. అనడం మాత్రమే కాకుండా అదే జరుగుతుంది చాలామంది రీ రిలీజ్ సినిమాలకు వెళ్లి వైబ్ అవుతుంటారు.

ఇకపోతే 2026 జనవరి 1వ తారీఖున మొత్తం రెండు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

నువ్వు నాకు నచ్చావ్ స్పెషల్ 

Advertisement

కొన్ని సినిమాలు అలా కుదురుతూ ఉంటాయి. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కుదిరింది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. ఇప్పటికీ కూడా టీవీల్లో ఆ సినిమా వస్తే చాలామంది అతుక్కుపోతారు.

అయితే అటువంటి సినిమా మళ్లీ థియేటర్లో విడుదలవుతుంది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఆ సినిమాకి కోటి అందించిన మ్యూజిక్ కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ పాటలు విపరీతంగా వినిపిస్తూ ఉంటాయి.

మహేష్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 

Advertisement

ఇకపోతే మహేష్ బాబు కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో మురారి ఒకటి ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా వచ్చినా కూడా టీవీలకు అతుక్కుని కూర్చుంటారు. కృష్ణవంశీ మహేష్ కోసం డిజైన్ చేసిన ఈ కథ చాలా అద్భుతంగా అప్పుడు వర్కౌట్ అయింది.

ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమాలో ఎమోషన్స్ ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ముఖ్యంగా మణిశర్మ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ రెండు పాత సినిమాలు కి కొత్త సంవత్సరంలో ఎంతటి సక్సెస్ వస్తుందో చూడాలి.

Also Read: Lokesh Kanagaraj : రజినీకాంత్, కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ తెలుగు హీరోలతో?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×