E-Paper
Advertisement

Jailer 2 : అప్పుడు తమన్నా ఇప్పుడు నోరా ఫతేహి, జైలర్ 2 ఐటమ్ గర్ల్ ఫిక్స్

Jailer 2 : అప్పుడు తమన్నా ఇప్పుడు నోరా ఫతేహి, జైలర్ 2 ఐటమ్ గర్ల్ ఫిక్స్
Advertisement

Jailer 2 : మొదట శింబు హన్సిక జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ ఒక సినిమాను మొదలుపెట్టాడు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత దాదాపు ఆరు సంవత్సరాలు వరకు మళ్లీ డైరెక్షన్ చేయలేదు నెల్సన్. మొత్తానికి నయనతార హీరోయిన్ గా చేసిన కొలమావు కోకిల సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత వచ్చిన వరుణ్ డాక్టర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ముఖ్యంగా శివ కార్తికేయన్ ను చూపించిన విధానంతో పాటు, ఆ సినిమాలో కామెడీని వర్కౌట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

విజయ్ తో అవకాశం

Advertisement

అయితే రెండు వరుస సక్సెస్ఫుల్ సినిమాలు తర్వాత ఏకంగా విజయ్ హీరోగా బీస్ట్ అనే సినిమా చేసే అవకాశం దక్కింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అప్పుడు చాలామంది నెల్సన్ దిలీప్ కుమార్ ను కామెంట్ చేశారు. మొత్తానికి రజినీకాంత్ హీరోగా చేసిన జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు నెల్సన్.

రజినీ కాంత్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది జైలర్ సినిమా. అయితే జైలర్ సినిమాకి ఎక్కువ కథకు ప్రాముఖ్యత ఇవ్వకుండా రజనీకాంత్ లోని ప్లస్ పాయింట్స్ అన్నిటిని కూడా దాంట్లో చూపించి సక్సెస్ అయ్యాడు నెల్సన్.

నోరా ఫతేహ స్పెషల్ సాంగ్

Advertisement

ముఖ్యంగా ఆ సినిమాలో తమన్నా చేసిన కావాలయ్య పాట కూడా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు జైలర్ 2 లో కూడా దాదాపు అటువంటి సాంగ్ నే ప్లాన్ చేశాడు నెల్సన్. అయితే ఈ పాటలో

నోరా ఫతేహ కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈమెకు సంబంధించిన పాట షూటింగ్ నేడే జరిగినట్లు కోలీవుడ్ వర్గాల్లో న్యూస్ వినిపిస్తుంది. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త హెయిర్ స్టైల్ వెనక రహస్యం ఏదైనా, తేరి రీమేక్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×