E-Paper
Advertisement

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!
Advertisement

Nagababu – Niharika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కి ఏకైక మెగా వారసురాలిగా నటన రంగంలోకి అడుగుపెట్టిన నిహారిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన తండ్రి నాగబాబు ఇండస్ట్రీలో హీరో అవుదామని ఎన్ని కలలు కన్నారో.. అటు నిహారిక కూడా హీరోయిన్ అవ్వాలని అంతే ఆశగా ఎదురుచూసింది. అలా ఒక మనసు, సూర్యకాంతం వంటి చిత్రాలలో లీడ్ రోల్ పోషించింది. కానీ అనుకున్నంత స్థాయిలో హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది. అటు నాగబాబు కూడా హీరోగా 1999లో తొలిసారి ప్రేయసిరావే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విక్రమ్ కౌరవుడు, 143, గణపతి లాంటి చిత్రాలలో హీరోగా నటించినా ఇవేవీ వర్కౌట్ కాక.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఒకవైపు సైడ్ పాత్రలతో అలరిస్తూనే మరొకవైపు పలు చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

తండ్రి లాగే నిహారికకు కూడా నేషనల్ అవార్డు..

ఇక తండ్రి జాడలోనే నిహారిక కూడా.. హీరోయిన్గా వర్కౌట్ కాకపోయే సరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అలరిస్తూ.. మరొకవైపు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా సినిమాలు చేస్తోంది . అలా నిర్మాతగా తొలి ప్రయత్నంలో నిర్మించిన తెలుగు ప్రాంతీయ చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఇకపోతే 2024 ఏడాదికి గానూ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా.. కమిటీ కుర్రోళ్ళు మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే ఇదే చిత్రానికి బెస్ట్ మేకప్ విభాగంలో కూడా నేషనల్ అవార్డు అందుకోవడంతో మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలుకొని ఎంతోమంది సెలబ్రిటీలు నిహారికకు అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. నిర్మాతగా అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా నేషనల్ అవార్డు అందుకోవడంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

also read:సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

38 ఏళ్ల తర్వాత ఆ రికార్డు రీ క్రియేట్..

ఇదెలా ఉండగా.. 38 ఏళ్ల తర్వాత తన తండ్రి రికార్డును మళ్ళీ క్రియేట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది నిహారిక. అసలు విషయంలోకి వెళ్తే.. నిర్మాతగా నాగబాబు కూడా ఒక సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. 1988లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ విభాగంలో బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నేషనల్ అవార్డు అందుకుంది. అంతేకాకుండా బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డులు కూడా ఈ సినిమాకు లభించాయి. అలా 38 ఏళ్ల తర్వాత తండ్రిలాగే తాను కూడా నిర్మాతగా నేషనల్ అవార్డును అందుకొని రికార్డు సృష్టించింది నిహారిక. అంతేకాదు ఇలా నిర్మాతలుగా రికార్డులు అందుకున్న తొలి తండ్రీకుతుళ్ళుగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు నిహారిక, నాగబాబు.

కష్టానికి దక్కిన అసలైన ప్రతిఫలం..

Advertisement

ఇక నిహారిక విషయానికి వస్తే.. జీవితంలో వివాహం, విడాకులు అంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్లీ నిర్మాతగా తన కెరియర్ ను మార్చుకొని.. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డును అందుకునే స్థాయికి ఎదగడంతో నిహారిక కష్టానికి ప్రతిఫలం అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. పడినవారు కచ్చితంగా లేవక తప్పదు అలా ఎన్నో అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొని అన్నిటికీ దీటుగా తన అవార్డుతో నిహారిక సమాధానం ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×