E-Paper
Advertisement

Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి కోసం మెగా డాటర్

Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి కోసం మెగా డాటర్
Advertisement

Raju Weds Rambai : ఈ రోజుల్లో కొంతమంది దర్శకులు సొంత కథలు ఆలోచించి రాయడం కాకుండా ఆల్రెడీ జరిగిన కథలనే వెండితెర మీద ఆవిష్కరించాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కథలు వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కథలను బట్టి ఎన్నో విషయాలు అర్థమవుతుంటాయి. ఎవరికీ తెలియని కథను వెండితెర మీద ఆవిష్కరించి అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది దర్శకులు ఉంటారు.

అటువంటి దర్శకులలో లిస్టులో వేణు ఉడుగుల ఖచ్చితంగా ఉంటారు. నీది నాది ఒకే కథ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వేణు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవి రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిన విరాటపర్వం సినిమాకు దర్శకత్వం వహించారు.

Advertisement

వెన్నెల అనే ఒక స్త్రీ పాత్రను పరిగణలోకి తీసుకొని ఈ సినిమా మలచాడు వేణు. ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా వేణు రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాను నిర్మించారు. ఈటీవీ విన్ కూడా ఈ సినిమాను నిర్మించింది.

రంగంలోకి మెగా డాటర్ 

యాంకర్ గా తన కెరియర్ మొదలుపెట్టిన నిహారిక తర్వాత కాలంలో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు. తను ఎంట్రీ ఇచ్చిన ఒక మనసు సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హీరో ఇంకా చేసిన సినిమాలేవి కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో నిర్మాతగా మారారు.

Advertisement

నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రలు సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరో సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా రిలీజ్ కి రెడీగా ఉండడంతో ఆ ప్రమోషన్స్ లో కూడా భాగమయ్యారు.

ఆకట్టుకున్న ప్రమోషనల్ వీడియో 

హీరోయిన్ తేజస్వి రావు మరియు హీరో నిహారిక దగ్గరకు వెళ్తారు. తేజస్వి నిహారికకు చెబుతుంది ఇతనిని నేను ప్రేమించాను అని. అయితే హీరోకి చాలా ప్రశ్నలు వేస్తుంది నిహారిక. కానీ దేనికి సరైన సమాధానం ఇవ్వడు.

అసలు నువ్వు ఏమీ మాట్లాడట్లేదు ఎలా చూసుకుంటావు అని ప్రశ్నించగానే సినిమాలోని సూపర్ హిట్ అయిన రాజ్యం ఏది లేదు గాని అనే పాటనే అందుకుంటాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ సినిమాను థియేటర్లో చూడండి అని నిహారిక పిలుపునిచ్చింది.

Also Read: Anushka Shetty : సొంత డబ్బులతో కాస్ట్యూమ్ కొనుక్కుంది, అందుకే అనుష్క అందరికీ స్వీటీ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×