E-Paper
Advertisement

Ram Pothineni: మీకు క్లాసులు పీకను గానీ లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి

Ram Pothineni: మీకు క్లాసులు పీకను గానీ లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి
Advertisement

Ram Pothineni: రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన వీడియో కంటెంట్ విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు విడుదలైన నాలుగు పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా కోసం తనలోని కొత్త కొత్త టాలెంట్స్ అన్నీ బయటికి తీసాడు. మొదటి పాటను తనే రాసేసాడు. రెండవ పార్ట్ కోసం ఏకంగా తన గాత్రాన్ని అందించాడు. మూడవ సాంగ్ మెలోడీ. నాలుగవ పాట అభిమానులకు అంకితం అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా కంటెంట్ చాలా బాగా కలిసి వస్తుంది. దీనివల్లనే సినిమా మీద కూడా ఒక రకమైన నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి హాజరయ్యాడు రామ్ పోతినేని. కాలేజీలో ఆసక్తికర స్పీచ్ ఇచ్చాడు.

రామ్ కాలేజ్ స్పీచ్

Advertisement

జనరల్ గా మెడికల్ కాలేజీలకు వెళితే డాక్టర్ల ని అడ్రస్ చేస్తాం.లా కాలేజీ కి వెళితే లాయర్స్ అని చెప్తాం.కానీ ఇంజినీరింగ్ కాలేజ్ కి వచ్చాం కాబట్టీ. మీరు లైఫ్ లో ఏమైన అవ్వచ్చు,మన సొసైటీ ఒకటి చెప్పుద్ది లైఫ్ లో ఏమైనా చేసేముందు మొదటి ఇంజనీరింగ్ చేసేయాలని. క్లాస్ లూ పీకను కానీ ఒకటి మాత్రమ్ లైఫ్ లో గుర్తు పెట్టుకోండి.” లైఫ్ లో ఏమవ్వాలి అనుకున్నా ప్యాషన్ మాత్రమ్ వదులుకోవద్దు ” అంటూ కాలేజీ స్టూడెంట్స్ కు చెప్పాడు రామ్.

కొంతమంది హీరోలు ఇలా స్పీచెస్ ఇస్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది. అయితే మొత్తానికి అవన్నీ చెబుతూ కూడా బీటెక్ ఫినిష్ చేయమని చెప్పాడు కాబట్టి దానిని సీరియస్ గా తీసుకుంటారు కొంతమంది స్టూడెంట్స్. అది చేసిన తర్వాతే మిగతా దాని గురించి ఆలోచిస్తారు. ఒకరకంగా అలా చెప్పడం కూడా మంచిదే.

కం బ్యాక్ ఇవ్వాల్సిందే 

Advertisement

టాలెంట్ ఉన్న హీరోలకు వరుసగా ప్లాప్ సినిమాలు పెడితే చాలా బాధగా ఉంటుంది. రామ్ సినిమా కోసం ఎంత కష్టపడతాడు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ రామ్ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే తన కష్టం వల్లనే. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ సరైన సక్సెస్ఫుల్ సినిమా చేయలేకపోయాడు.

ఇప్పుడు రాబోతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీదే అన్ని అంచనాలు ఉన్నాయి. అలానే దర్శకుడు మహేష్ బాబు కూడా చివరి సినిమా మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టితో సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాతో కూడా మరోసారి సక్సెస్ అందుకుంటాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఏం జరుగుతుంది అనేది నవంబర్ 27 తెలుస్తుంది.

Also Read: Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి కోసం మెగా డాటర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×