E-Paper
Advertisement

‘బరి’ పూర్తికాకుండానే మరో సినిమాని లైన్ లో పెట్టిన నిహారిక..మెగా డాటర్ స్పీడ్ మామూలుగా లేదే!

‘బరి’ పూర్తికాకుండానే మరో సినిమాని లైన్ లో పెట్టిన నిహారిక..మెగా డాటర్ స్పీడ్ మామూలుగా లేదే!
Advertisement

Niharika Konidela: మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగాను, నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా మెగా డాటర్ నిహారిక వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన సినిమాలను సొంతం చేసుకుంటున్నారు. ఈమె పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ద్వారా పలు వెబ్ సిరీస్ లను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. అనంతరం కమిటీ కుర్రాళ్లు సినిమా ద్వారా వెండితెరకు నిర్మాతగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి రాకాస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నారు.

వరుణ్ తేజ్ తో బరి..

ఇకపోతే రాకాస సినిమా విడుదల కాకుండానే నిహారిక(Niharika) తన మూడో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. తన అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా వాలీబాల్ బ్యాక్ డ్రాప్ లో కమిటీ కుర్రాళ్ళు దర్శకుడు యదు వంశీ దర్శకుడిగా బరి అనే సినిమాను ప్రకటించారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి అయితే వరుణ్ తేజ్ కాలికి గాయం కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే నిహారిక తన తదుపరి సినిమా గురించి ప్రకటన చేశారు.

నిహారిక నిర్మాణంలో సుధీర్ సినిమా?

Advertisement

నిహారిక ప్రస్తుతం జీ తెలుగులో ఆట డాన్స్ (Aata Dance Show) షో కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే .ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా నిహారిక మాట్లాడుతూ తన తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. నేను ఎప్పటినుంచో సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) తో సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ విషయం నాన్నగారితో చెప్పగా నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సుదీర్ తో సినిమా కోసం 25 కోట్ల బడ్జెట్ కేటాయించామని, అనిరుధ్ సంగీతంలో ఈ సినిమా రాబోతోంది అంటూ ఈమె తెలిపారు.

హీరోగా బిజీగా ఉన్న సుధీర్..

Advertisement

నిహారిక ఇలా చెప్పడంతో వెంటనే జడ్జిగా కొనసాగుతున్న రాధిక కూడా స్పందిస్తూ తన భర్త శరత్ కుమార్ కు సుధీర్ బాగా నచ్చారని తనతో సినిమా చేస్తానని కూడా చెప్పారు అంటూ రాధిక మాట్లాడారు. దీంతో సుధీర్ తాను శరత్ కుమార్ గారితో సినిమా చేయను కానీ నిహారిక గారితోనే సినిమా చేస్తానని చెప్పారు. ఇలా సుదీర్ తో సినిమా చేస్తానని నిహారిక, రాధిక చెప్పడంతో నిజమేనని అందరూ భావించారు కానీ చివరికి అది ఫ్రాంక్ అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. ఇక సుడిగాలి సుదీర్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్ గా బుల్లి తెరపై ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Also Read: సెటిల్ అయ్యాకే డబ్బులు ఇస్తా.. ధర్మేంద్రను బెదిరించిన అషురెడ్డి.. ఆడియో లీక్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×