// // New KYT R1R Helmet: మండుటెండలో చల్లని ప్రయాణం.. క్రేజీ KYT R1R హెల్మెట్ లాంచ్! -->
E-Paper
Advertisement

మండుటెండలో చల్లని ప్రయాణం.. క్రేజీ KYT R1R హెల్మెట్ లాంచ్!

మండుటెండలో చల్లని ప్రయాణం.. క్రేజీ KYT R1R హెల్మెట్ లాంచ్!
Advertisement

KYT R1R Helmet India Launch: ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ KYT ఇండియన్ మార్కెట్‌ లోకి సరికొత్త R1R రేసింగ్ హెల్మెట్‌ ను విడుదల చేసింది. ఈ హెల్మెట్ ప్రారంభ ధర సుమారు రూ. 39,000గా నిర్ణయించింది. ఈ మోడల్‌ ను బ్రాండ్ MotoGP రేసింగ్ ప్రోగ్రామ్ నుంచి ప్రేరణగా తీసుకొని డిజైన్ చేసింది. ఇంకా చెప్పాలంటే, సాధారణ హెల్మెట్ లా కాకుండా ప్రొఫెషనల్ రైడర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది.

మూడు వేరియంట్లలో KYT R1R హెల్మెట్  

KYT R1R హెల్మెట్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటిది కలర్ గ్రాఫిక్స్ వేరియంట్. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ధర రూ. 39,000. రెండవది కార్బన్ గ్రాఫిక్ వేరియంట్. ఇది కార్బన్ ఫినిష్‌ తో పాటు కొన్ని కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 43,500. మూడవది రెప్లికా రేంజ్. ఇది MotoGP రైడర్లు ఉపయోగించే హెల్మెట్ల లుక్‌ ను పోలి ఉంటుంది. దీని ధర కూడా రూ. 43,500 ఉంటుంది. రేసింగ్ ఫీలింగ్ కోరుకునే వారికి ఈ రెప్లికా మోడల్ బాగా నచ్చుతుంది.

KYT R1R హెల్మెట్ ఫీచర్లు

Advertisement

KYT R1R హెల్మెట్ ఫీచర్ల విషయానికి వస్తే, లోపలి లైనింగ్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్‌ తో తయారు చేశారు. ఇది రైడర్ తలను చల్లగా ఉంచడంలో సాయపడుతుంది. ఎక్కువ సేపు ప్రయాణించినప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది. వైజర్ విషయానికి వస్తే,  పిన్‌ లాక్ సిస్టమ్‌ కు అనుకూలంగా ఉంటుంది. ఫాగింగ్ సమస్యను తగ్గిస్తుంది. మంచి విజుబులిటీని అందిస్తుంది.  రైడింగ్ టైమ్ లో రోడ్డు క్లియర్ గా కనిపిస్తుంది.

సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ

సేఫ్టీ విషయంలో కూడా KYT ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ హెల్మెట్‌ లో డబుల్ డి రింగ్ బకిల్ సిస్టమ్ ఉంటుంది. ఇది సాధారణంగా కనిపించే మైక్రోమెట్రిక్ బకిల్ కంటే మరింత సేఫ్టీగా ఉంటుంది. ఈ మోడల్‌కు ECE 22.06, ISI సర్టిఫికేషన్లు ఉన్నాయి. అంతర్జాతీయ, భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. భద్రత విషయంలో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

ఈ హెల్మెట్ ను ఎలా కొనాలంటే?

Advertisement

ఈ హెల్మెట్‌ను కొనాలనుకునే వారు KYT ఇండియా అఫీషియల్ వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌ లో ఆర్డర్ చేయవచ్చు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్ల దగ్గర కూడా ఈ హెల్మెట్ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమకు దగ్గరలో ఉన్న షోరూమ్‌ లో కూడా ఈ హెల్మెట్‌ ను చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. KYT R1R ట్రాక్ రైడింగ్ కోసం తయారు చేశారు. రేసింగ్, ట్రాక్ డే ఈవెంట్లలో పాల్గొనే వారికి ఈ హెల్మెట్ బాగా ఉపయోగపడుతుంది. రోజువారీ రైడింగ్ కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. భద్రతను ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది మంచి ఆప్షన్‌ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఒకే చోట టైర్ కొనుగోలు, సర్వీస్.. రైస్ కొత్త కాన్సెప్ట్ భలే ఉంది భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×